Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి క‌ల నెర‌వేరింది.. బోనీ ఉద్వేగం!

By:  Tupaki Desk   |   6 Aug 2019 1:24 PM IST
శ్రీ‌దేవి క‌ల నెర‌వేరింది.. బోనీ ఉద్వేగం!
X
త‌ళా అజిత్ హీరోగా త‌మిళంలో బోనీక‌పూర్ ఓ చిత్రాన్ని నిర్మించాల‌న్న‌ది శ్రీ‌దేవి కోరిక‌. మామ్ చ‌నిపోయే ముందు విష్ ఇది. ప్ర‌స్తుతం ఆ కోరిక‌ను నెర‌వేరుస్తున్నారు బోనీ క‌పూర్. అజిత్ హీరోగా ఆయ‌న నిర్మించిన `నేర్కొండ పార్వాయ్` (పింక్ రీమేక్) త‌మిళంతో పాటు అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. సింగ‌పూర్ స‌హా త‌ళా ఫ్యాన్స్ ఉన్న ప్ర‌తిచోటా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అమెరికా- బ్రిట‌న్- ఆస్ట్రేలియా- న్యూజిల్యాండ్ లాంటి చోట్లా ఈ చిత్రాన్ని పెద్ద రేంజులోనే రిలీజ్ చేస్తున్నారు.

ఆగ‌స్టు 8న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. ఆరోజు ఉద‌యం 9 గంట‌ల‌కే సింగ‌పూర్ లో ప్రీమియ‌ర్లు వేస్తున్నార‌ట‌. కేవ‌లం ఓవ‌ర్సీస్ లోనే 600 పైగా వ‌ర్చువ‌ల్ సోలో షోస్ తో ఈ సినిమా ప్రీమియ‌ర్లు ప్లాన్ చేశార‌ట‌. హెచ్.వినోద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ రిలీజ్ సంద‌ర్భంగా బోనీ కాస్తంత ఎమోష‌న‌ల్ గానే సోష‌ల్ మీడియాలో స్పందించారు. అజిత్ స‌హ‌కారం లేనిదే శ్రీ‌దేవి చివ‌రి కోరిక‌ను నెర‌వేర్చ‌లేక‌పోయేవాడినేమో! అంటూ ఉద్వేగానికి గురయ్యారు బోనీ.

ఇంగ్లీష్ వింగ్లీష్ త‌మిళ వెర్ష‌న్ చిత్రీక‌రించేప్పుడు శ్రీ‌దేవి ఈ కోరిక‌ను కోరారు. అజిత్ హీరోగా ఓ త‌మిళ చిత్రం నిర్మించాలి అని బోనీని అడిగారు కాబ‌ట్టి ఆ కోరిక ఇప్ప‌టికి నెర‌వేరుతోంది. ఈ సినిమాతో పాటు అంత‌ర్జాతీయ స్థాయిలో రేసింగ్ (స్పోర్ట్స్) కాన్సెప్ట్ తో వేరొక భారీ చిత్రాన్ని అజిత్ హీరోగా బోనీక‌పూర్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది.