Begin typing your search above and press return to search.

పులిలో పెద్ద రాణికి కత్తెరడిందోచ్‌

By:  Tupaki Desk   |   11 Sept 2015 8:32 PM IST
పులిలో పెద్ద రాణికి కత్తెరడిందోచ్‌
X
బాహుబలిలో శివగామి పాత్ర కోసం అడిగితే.. కుదరదని చెప్పిన శ్రీదేవి.. కోలీవుడ్ కే ప్రెస్టీజియస్ మూవీ పులిలో కీలక పాత్ర పోషించింది. పెద్ద రాణిగా పెద్ద వేషమే వేసింది. ఇప్పుడు ఫైనల్ గా తన కేరక్టర్ చూసుకునేసరికి.. ఈమెకు మతిపోయిందట. లెంగ్త్ ఎక్కువైందంటూ.. అడ్డంగా కోసేశారట శ్రీదేవి సీన్స్ అన్నీ.

డబ్బింగ్ చెప్పేందుకు చెన్నై వచ్చినపుడు తన పాత్ర చూసుకున్న శ్రీదేవి.. ఈ కటింగ్ చూసి బాగా ఫీలయిందని టాక్. డబ్బింగ్ థియేటర్ నుంచి వెళ్లిపోతుంటే.. బతిమాలి మరీ తీసుకొచ్చి.. ఒప్పించి కంప్లీట్ చేయించారని చెప్పుకుంటున్నారు. అలాగే తెలుగు వెర్షన్ డబ్బింగ్ కోసం కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో.. చచ్చినట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది నిర్మాతలకు.

షూటింగ్ టైంలో చాలా సీన్స్ చిత్రీకరించినా.. సినిమాలో మాత్రం శ్రీదేవి కేరక్టర్ నిమిషాలకే పరిమితమైందని తెలుస్తోంది. తెలుగు సినిమా చేసి రమ్యకృష్ణ దేశమంతా క్రేజ్ సంపాదించుకుంటే.. ఆ పాత్రని వదులుకున్న శ్రీదేవి మాత్రం డబ్బులు బాగా వసూలు చేసుకుని సంతృప్తి పడాల్సి వస్తోంది.