Begin typing your search above and press return to search.

ఓటీటీలో అతిలోక సుంద‌రి కుమార్తె మెరుపులు

By:  Tupaki Desk   |   18 March 2022 1:30 AM GMT
ఓటీటీలో అతిలోక సుంద‌రి కుమార్తె మెరుపులు
X
క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టినా ఓటీటీ రిలీజ్ ల వేగం త‌గ్గ‌లేదు. థ‌ర్డ్ వేవ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌లు బాలీవుడ్ చిత్రాలు ముందొస్తుగానే ఓటీటీ రిలీజ్ డేట్ల‌ను లాక్ చేసుకున్నాయి. అలాగే థియేట‌ర్ రిలీజ్ డౌట్ ఉన్న చిత్రాల‌న్ని తెలివిగా డిజిట‌ల్ మ‌ధ్యామాల‌కే కంటెంట్ అమ్మేసి సేఫ్ జోన్ లో ఉంటాయి. ఇటీవలే దీపికా ప‌దుకొణే-సిద్దాంత్ చ‌తుర్వేది న‌టించిన 'గెహ్రాయాన్' ఓటీటీలో రిలీజ్ అయి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.

దీపికా ప‌దుకొణే బోల్డ్ అటెంప్ట్ తో సినిమా ఓటీటీలో గ‌ట్టెక్కిపోయింది. అంత‌కు ముందు ప‌లు తెలుగు.త‌మిళ్ చిత్రాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అయి స‌క్సెస్ సాధించాయి. తాజాగా స్టార్ కిడ్ జాన్వీక‌పూర్ న‌టించిన 'గుడ్ ల‌క్ జెర్రీ' చిత్రాన్ని కూడా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డిస్నీ హాట్ స్టార్ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల్ని కొనుగోలు చేసింది. దీంతో అతి త్వ‌ర‌లోనే మంచి తేదీతో ఓటీటీలో 'గుడ్ ల‌క్' జెర్రీ రిలీజ్ కానుంది. దానికి సంబంధించి ప్రోమోల‌ని కూడా స‌ద‌రు ఓటీటీ సిద్దం చేస్తుంది. అదే సంద‌ర్భంలో రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌న‌న్నారు.

జాన్వీ క‌పూర్ న‌టించిన ఈ చిత్రానికి సిద్ధార్ధ్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళ్ లో విజ‌యం సాధించిన 'కొల‌మావు కొక్కిల' సినిమాకి రీమేక్ రూపం ఇది. మాతృక‌లో న‌య‌న‌తార న‌టించింది. ఆమె పాత్ర‌లో జాన్వీ క‌పూర్ క‌నిపించ‌నుంది. ఇంకా దీప‌క్ డోబ్రియాల్..మితా వ‌శిష్ట్ ..నీర‌జ్ సూద్..సుశాంత్ సింగ్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించారు. వాస్త‌వానికి ఈ సినిమా చాలా కాలం క్రితం ప్రారంభ‌మైంది. కోవిడ్ కార‌ణంగా షూటింగ్ స‌హా ఇత‌ర ప‌నులు ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో రిలీజ్ ఆల‌స్య‌మైంది.

ముందుగా చిత్రాన్ని థియేట‌ర్లోనే రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఆ కార‌ణంగానూ కొంత జాప్యం చోటు చేసుకుంది. కానీ ఎట్ట‌కేల‌కు డిస్నీ హాట్ స్టార్ లో 'గుడ్ ల‌క్ జెర్రీ' ప్ర‌సారం కావ‌డం విశేషం. ఇక సినిమాకి సంబంధించిన ప్ర‌చారం ప‌నులు కూడా యూనిట్ ప్రారంభించే అవ‌కాశం ఉంది.

జాన్వీ ఇత‌ర ప్రాజెక్ట్ ల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో 'దోస్తానా-2' లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. 'మిలీ' అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది.

అలాగే దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.