Begin typing your search above and press return to search.

అతిలోకసుందరి తనయ అరంగేట్రానికి షూట్!

By:  Tupaki Desk   |   3 Jan 2017 4:42 AM GMT
అతిలోకసుందరి తనయ అరంగేట్రానికి షూట్!
X
వెండితెర అతిలోకసుందరి శ్రీదేవి కి, ఆమె ఫ్యామిలీకి సంబందించిన ఏ విషయమైనా అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్కే! అయితే శ్రీదేవి హీరోయిన్ గా వెండితెరపై సృష్టించిన అలజడి, చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆ అతిలోకసుందరి కూతురు సినీ అరంగేట్రానికి సంబందించి రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితులను బట్టి చూస్తే... శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అరంగేట్రానికి ఆల్ మోస్ట్ అంతా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంలో శ్రీదేవి కూతురు హీరోయిన్ గా రాబోతుందని వార్తలొస్తున్నా ఈ విషయంలో బోనీ - శ్రీదేవీలు ఆ విషయంపై క్లియర్ గా స్పందించింది లేదు. అయితే ప్రస్తుత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ సినీ అరంగేట్రానికి అంతా సిద్దంగా ఉందని, ఈ విషయంలో అటు నటన, ఇటు డాన్సుల కు సంబందించిన మెలుకువలు తల్లే దగ్గరుండి చూసుకుంటుందని సమాచారం. ఈ క్రమంలో తాజాగా జాన్వీకి సంబంధించిన ఫోటో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో ప్రకారం... జాన్వీ తన ఫస్ట్ ఫోటో షూట్ ని కూడా ఇప్పటికే పూర్తి చేసిందని తెలుస్తోంది!

అయితే ఈ ఫోటో వ్యవహారం గురించి తెలుస్తోన్న సమాచారం ప్రకారం... త్వరలోనే జాన్వీ కపూర్ ఒక బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోందట. "సైరత్" అనే మరాఠీ సినిమా హిందీ రీమేక్ లో ఇషాన్ కట్టర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. దీంతో శ్రీదేవి తనయ అరంగేట్రంపై చాలా వరకూ క్లారిటీ వచ్చేసినట్లే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/