Begin typing your search above and press return to search.

టీనేజ్ శ్రీదేవిని మళ్లీ చూపిస్తోందిగా

By:  Tupaki Desk   |   8 Feb 2017 1:16 PM GMT
టీనేజ్ శ్రీదేవిని మళ్లీ చూపిస్తోందిగా
X
అందాల తార శ్రీదేవి ఓ దశాబ్దంన్నర క్రితం వరకూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఏలేసింది. సుదీర్ఘ కాలంపాటు బాలీవుడ్ నంబర్ 1 ప్లేస్ లో ఉన్న శ్రీదేవి రికార్డు.. ఇంకా చెక్కు చెదరలేదనే చెప్పాలి. ఇప్పటికీ ఈ అతిలోక సుందరికి బోలెడంత క్రేజ్ ఉంటుంది. ఇందుకు కారణం అందం.. అభినయంతో పాటు ఆమె కళ్లలో ఉండే అసామాన్యమైన ఆకర్షణే.

అయితే.. టీనేజ్ లో శ్రీదేవి ఎలా ఉండేదో ఇప్పుడు చాలామందికి తెలియదు కానీ.. అచ్చుగుద్దినట్లుగా అలాంటి పోలికలనే దింపేసింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్. సాధారణంగా అరకొరా డ్రస్సులతో అల్ట్రా మోడర్న్ గా ఫోటోలకు చిక్కడం.. కవ్వించే పోజులతో రెచ్చగొట్టడం తప్ప.. శ్రీదేవి మాదిరిగా నిండుగా కప్పుకుని ఈ టీనేజ్ బ్యూటీ కనిపించలేదనే చెప్పాలి. దాదాపు మొదటిసారిగా.. నిండుగా డ్రసింగ్ చేసుకుని.. లూజ్ హెయిర్ తో ఏ మాత్రం మేకప్ లేకుండా.. తన అసలైన అందాన్ని చూపించేలా ఫోటోలకు చిక్కింది జాన్వి కపూర్.

ఈ కుర్రదాని ఫోటో చూసి.. వయసులో ఉన్నప్పటి శ్రీదేవిని గుర్తు చేసేసుకుంటున్నారు అందాలతార అభిమానులు. ముఖ్యంగా కళ్లలో కనిపించే మెరుపులు మాత్రం యథాతథంగా దించేసింది. మరి ట్యాలెంట్ విషయంలో కూడా ఆ వారసత్వం కంటిన్యూ చేస్తే.. బాలీవుడ్ టాప్ బ్యూటీగా ఎదిగేందుకు జాన్వికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. అఫ్ కోర్స్.. ఇంకా అరంగేట్రం ఖాయం కాలేదులే!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/