Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ : శ్రీదేవి డాటర్ ధఢఖ్

By:  Tupaki Desk   |   15 Nov 2017 10:05 PM IST
ఫస్ట్ లుక్ : శ్రీదేవి డాటర్ ధఢఖ్
X
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన అందం తో నటనతో ఆకట్టుకున్న శ్రీదేవి ఇప్పుడు తన కూతుళ్లని రంగం లోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. అయితే ముందుగా పెద్ద కూతురు జాహ్నవి వెండి తెర ఎంట్రీకి శ్రీదేవి అంతా సిద్ధం చేసుకుంది. మొన్నటి వరకు తెలుగు అండ్ తమిళ్ లో స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనుందని ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ శ్రీదేవి మాత్రం సౌత్ ను అంతగా ఇష్టపడదని ఒక టాక్ ఉంది. మొత్తానికి బాలీవుడ్ లో కూతురి సినిమాను రెడీ చేసింది.

రీసెంట్ గా ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మరాఠి లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచి వంద కోట్లను క్రాస్ చేసిన సైరత్ మూవి బాలీవుడ్ లో ఇప్పుడు ధఢఖ్ అనే పేరుతో రీమేక్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇక జాహ్నవి సరసన ఇషాన్ ఖటర్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో జాహ్నవి చాలా సింపుల్ అండ్ క్యూట్ గా కనిపిస్తోంది. హీరో కూడా కొంచెం డీసెంట్ గానే కనిపిస్తున్నాడు.

ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ఒరిజినల్ కథలా కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి జాహ్నవి ఎంతవరకు ఆకట్టుకుంటుందో..