Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురు ఆ హీరోతో!

By:  Tupaki Desk   |   4 Oct 2016 4:20 AM GMT
శ్రీదేవి కూతురు ఆ హీరోతో!
X
ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి - ముఖ్యంగా తెలుగువారికి అతిలోక సుందరి అయిన శ్రీదేవి - కూతురు జాహ్నవి తెరంగేట్రం విషయం పరిశ్రమలో చర్చనీయాంశం అయినా వారుమాత్రం ఇప్పటివరకూ పెద్దగా స్పందించిన సంగతి లేదు! అయితే జాహ్నవి కపూర్ ని శ్రీదేవి ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతోందా...? ఏ సినిమాతో, ఏ హీరోతో సినిమా ఆరంభం కానుంది? ఈ ప్రశ్నలన్నింటినీ గతంలో ఒకటిరెండు సార్లు శ్రీదేవి ఖండించింది. జాహ్నవి ఇంకా చిన్నపిల్లేనని - చదువుకుంటుందని - తనపై ఇటువంటి వార్తలు రాయొద్దని మీడియాకు చెప్పింది. అయితే అదంతా గతం... తాజాగా జాహ్నవి కపూర్ ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి అంతా సిద్దమైపోయిందని బాలీవుడ్ లేటెస్ట్ టాక్!

మొన్నటికి మొన్న మహేశ్‌ బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్‌ గా ముందు శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్‌ ను సంప్రదించారని గాసిప్‌ లు హల్‌ చల్ చేశాయి. కృష్ణగారి అబ్బాయి - శ్రీదేవి గారి అమ్మాయి... కాంబినేషన్ సూపరని అభిమానులు భావించారు. అయితే లేటెస్ట్ బాలీవుడ్ అప్‌ డేట్ ఏంటంటే... నిజంగానే జాహ్నవి త్వరలో మేకప్ వేసుకోనుందట. అయితే అది మహేష్ సినిమాతో కాదు - వరుణ్ ధావన్ హీరోగా ప్రముఖ హిందీ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సినిమాలో. కరణ్ జోహార్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న "శిద్దత్" అనే సినిమాలో జాహ్నవి నటించనుందని బీటౌన్ లేటెస్ట్ టాక్.

అయితే ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా ఆలియా భట్ నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ... తాజా కథనాల ప్రకారం శ్రీదేవి కుమార్తెను కరణ్ జోహార్ పరిచయం చేయాలనుకుంటున్నారట. "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" సినిమాతో ఆలియాను ఇంట్రడ్యూస్ చేసిన జోహార్.. "సిద్దత్" సినిమాతో జాహ్నవి ని పరిచయం చేయాలని భావిస్తున్నారట. అయితే ఇలా యంగ్ టాలెంట్‌ ను ఇంట్రడ్యూస్ చేయడంలో కరణ్ స్పెషలిస్ట్ కావడంతో శ్రీదేవి కూడా అంగీకరించారట. అయితే... తాజాగా జరిగిన "మీర్జ్యా" ప్రీమియర్ షోలో పాల్గొన్న జాహ్నవి కపూర్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచిందట. ఆమె అందం, ధరించిన దుస్తులతో అందరికళ్లూ ఆమెపైనే ఉన్నాయట. దీంతో ప్రస్తుత ఫిజిక్ చూస్తుంటే - హీరోయిన్‌ గా అరంగేట్రం చేయడానికి జాహ్నవి రెడీ అవుతోందని ఫిక్సయిపోతున్నారు బాలీవుడ్ జనాలు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/