Begin typing your search above and press return to search.
మాదేం బయోపిక్ కాదు..
By: Tupaki Desk | 17 Jan 2019 1:25 PM ISTప్రియా వారియర్ హీరోయిన్ గా రూపొందుతున్న 'శ్రీదేవి బంగ్లా' సినిమా చుట్టు వివాదం రాజుకుంటుంది. ఈ చిత్రం టీజర్ విడుదలైన తర్వాత ఇది ఖచ్చితంగా శ్రీదేవి జీవిత చరిత్ర ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాగా శ్రీదేవి భర్త బోణీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్ సభ్యులకు లీగల్ నోటీసులను కూడా పంపిన విషయం తెల్సిందే. హీరోయిన్ ప్రియావారియర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించడంతో పాటు, సినిమాల్లో నటిస్తూనే ఒంటరితనంతో భాద పడుతూ ఉండే పాత్రలో కనిపించబోతుంది. టీజర్ లో శ్రీదేవి మరణించినట్లుగా బాత్ రూం టబ్ లో జారి పడి మరణించినట్లుగా కూడా చూపిస్తున్నారు.
శ్రీదేవి సినీ జీవితం మరియు మరణంకు సంబధించిన సీన్స్ ఈ సినిమాలో ఉన్న కారణంగా ఇది శ్రీదేవి బయోపిక్ గా పరిగణించడంతో పాటు, సినిమా విడుదలను నిలిపేయాలంటూ బోణీకపూర్ కోర్టును ఆశ్రయించాడు. దాంతో శ్రీదేవి బంగ్లా చిత్ర యూనిట్ సభ్యులు వివాదంపై స్పందించారు. మేము తెరకెక్కిస్తున్న సినిమాకు శ్రీదేవి జీవిత చరిత్రకు సంబంధం లేదని, శ్రీదేవి అనే టైటిల్ పెట్టడం వల్ల ఇలా బయోపిక్ అంటూ టాక్ రావడం విచిత్రంగా ఉందని చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
బోణీ కపూర్ పంపించిన లీగల్ నోటీసులకు సమాధానంగా తాము తీస్తున్నది శ్రీదేవి బయోపిక్ కాదని, తాము ఒక సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చారు. కథలో హీరోయిన్ సినీ స్టార్ అని, అందువల్లే శ్రీదేవి అనే టైటిల్ ను పెట్టినట్లుగా వారు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్ జరుగుతుంది. సినిమా చూసిన తర్వాత బోణీకపూర్ మాట్లాడాలని చిత్ర దర్శకుడు అంటున్నాడు. అయితే టీజర్ చూస్తే మాత్రం శ్రీదేవి కథ అని క్లీయర్ గా అనిపిస్తుంది. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.