Begin typing your search above and press return to search.

జాన్వీ క‌ళ్లు మాత్ర‌మేనా ఆ ముక్కు కూడా..!

By:  Tupaki Desk   |   14 Aug 2022 2:30 AM GMT
జాన్వీ క‌ళ్లు మాత్ర‌మేనా ఆ ముక్కు కూడా..!
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి హ‌ఠాన్మ‌రణం ఇప్ప‌టికీ అభిమానుల‌కు ఒక మిస్ట‌రీనే. `మామ్` జ్ఞాప‌కాల్ని వార‌సురాళ్లు జాన్వీ క‌పూర్.. ఖుషీ క‌పూర్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేరు. వీలున్న ప్ర‌తి సంద‌ర్భంలో త‌న‌ని ఎంత‌గా మిస్స‌వుతున్నారో వెల్ల‌డిస్తూనే ఉన్నారు.

నేడు శ్రీదేవి జన్మదినోత్సవం (జ‌యంతి) సంద‌ర్భంగా జాన్వీ క‌పూర్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. దివంగత న‌టి శ్రీ‌దేవితో క‌లిసి ఉన్న ఒక‌ అరుదైన అన్ నోన్ ఫోటోని జాన్వీ కపూర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.

తన తల్లితో ఉన్న చిన్ననాటి సూపర్ క్యూట్ ఫోటోలను కూడా జాన్వీ షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. తల్లీ-కూతుళ్ల జోడీ మురిపించే ఫోటోలకు అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది.

దివంగత నటి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ త‌న‌కు నివాళులు అర్పించారు. శ్రీదేవి మన మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మడం కష్టం. ఇంగ్లీష్ వింగ్లీష్.. మామ్ లాంటి చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్న శ్రీ‌దేవి 2018లో ఆక‌స్మికంగా మరణించారు. ఈరోజు త‌న‌ 59వ జన్మదినోత్సవం.

తాజాగా షేర్ చేసిన ఫోటోకి జాన్వీ ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చింది. ``పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా`` నేను నిన్ను రోజు రోజుకు ఎక్కువగా మిస్ అవుతున్నాను. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను`` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యింది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు జాన్వీ - శ్రీదేవి అభిమానులకు ఒక స్పెష‌ల్ ట్రీట్.

పెద్ద స్క్రీన్ పై జాన్వీని చూస్తున్నప్పుడు శ్రీదేవి పోలిక‌లు కొన్ని క‌నిపిస్తుంటాయి. ముఖ్యంగా త‌న క‌ళ్ల‌ను చూసి పోలిక‌ను చెబుతుంటారు ఫ్యాన్స్. తాజాగా షేర్ చేసిన క్యూట్ ఫోటోలో కూడా జాన్వీ తన తల్లికి ప్రతిరూపంగా కనిపించింది. జాన్వీ క‌ళ్లు మాత్ర‌మేనా ముక్కు కూడా..అచ్చం మామ్ నే పోలి ఉంది! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోతో పాటు షేర్ చేసిన ఇత‌ర ఫోటోల్లో శ్రీదేవి - బోనీ కపూర్ - జాన్వి ఒక పరిపూర్ణ కుటుంబంగా క‌నిపించారు.