Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు.. చిత్రమైన సెంటిమెంట్

By:  Tupaki Desk   |   30 March 2017 12:22 PM GMT
శ్రీవిష్ణు.. చిత్రమైన సెంటిమెంట్
X
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లెక్కువ. అవి పాజిటివ్ అయినా అయ్యుంటాయి. నెగెటివ్ అయినా అయ్యుంటాయి. ఏదైనా నెగెటివ్ సెంటిమెంట్ కనిపిస్తే వెంటనే బ్రేక్ చేయాలని చూస్తారు. పాజిటివ్ సెంటిమెంటుంటే అలాగే కొనసాగిస్తారు. యువ కథానాయకుడు శ్రీ విష్ణుకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. తన క్యారెక్టర్లకు ‘రాజు’ అనే పేరుంటే ఆ సినిమా హిట్టవుతుందని.. తనకు మంచి పేరు తెస్తుందని అతను నమ్ముతాడు.

శ్రీవిష్ణు తొలిసారి హీరో పాత్ర పోషించిన సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’. ఇందులో అతడి పాత్ర పేరు రాయల్ రాజు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలందుకుంది. శ్రీవిష్ణు అంటే ఏంటో జనాలకు తెలిసింది కూడా ఆ సినిమాతోనే. అందులో రాయల్ రాజు పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో శ్రీవిష్ణు క్యారెక్టర్ పేరు.. రైల్వే రాజు. శ్రీవిష్ణు అసలు పేరు కంటే కూడా ఈ పేరే ఎక్కువ పాపులరైంది. అంత మంచి పేరు తెచ్చింది ‘రైల్వే రాజు’ పాత్ర.

ఇప్పుడిక మరోసారి శ్రీవిష్ణు ‘రాజు’గా రాబోతున్నాడు. నిన్న ఉగాది కానుకగా రిలీజైన శ్రీవిష్ణు కొత్త సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. అందులో శ్రీవిష్ణు పాత్ర పేరు రుద్రరాజు సాగర్ అని అర్థమవుతుంది. శ్రీవిష్ణు సెంటిమెంటుతోనే తన పేరులో రాజు వచ్చేలా చూశాడనిపిస్తోంది. ఈ పోస్టర్ జనాల్ని భలే ఆకట్టుకుంది. ఒక వైవిధ్యమైన సినిమాలా కనిపించింది. వేణు ఊడుగుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయవుతున్నాడు. నారా రోహిత్ సమర్పణలో కృష్ణవిజయ్.. ప్రశాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా వీళ్ల బేనర్లోనే తెరకెక్కింది. మరి ‘రాజు’ సెంటిమెంట్ మరోసారి వర్కవుటవుతుందేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/