Begin typing your search above and press return to search.

ఈ సినిమా నాతో ఎందుకో-శ్రీవిష్ణు

By:  Tupaki Desk   |   22 Feb 2017 3:35 PM GMT
ఈ సినిమా నాతో ఎందుకో-శ్రీవిష్ణు
X
అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ సినిమాలో అదిరిపోయే న‌ట‌న‌తో పెద్ద షాకే ఇచ్చాడు శ్రీవిష్ణు. ఓ ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన బ‌రువైన పాత్ర‌ను అత‌ను బాగానే ర‌క్తి క‌ట్టించాడు. ఈ సినిమా త‌ర్వాత అత‌డికి అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. కుమార్ వ‌ట్టి అనే కొత్త ద‌ర్శ‌కుడితో శ్రీవిష్ణు చేసిన సినిమా ‘మా అబ్బాయి’. ఇది ఒక పెద్ద హీరోతో చేయాల్సిన సినిమా అని.. త‌న‌తో ఇలాంటి క‌థ‌ను తెర‌కెక్కించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే అని అంటున్నాడు శ్రీవిష్ణు.

‘‘కుమార్ క‌థ చెప్ప‌గానే.. ఇది పెద్ద క‌థ పెద్ద స్టార్లు ఎవ‌రితోనైనా చేయాల్సిన క‌థ అనిపించింది. నాతోనే ఎందుకు అని అడిగాను. కానీ న‌న్ను ఎలాగో కుమార్ క‌న్విన్స్ చేసి సినిమా చేశాడు. చిన్న‌ప్పుడు సైనిక స్కూల్ లో క‌ష్ట‌ప‌డ్డ‌ట్లు ఈ సినిమా కోసం క‌ష్ట‌పడ్డాను. ద‌ర్శ‌కుడు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా తీశాడు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి పంచే చిత్ర‌మిది. ‘మా అబ్బాయి’గా మీ ముంద‌కు వ‌స్తున్న న‌న్ను మీ అబ్బాయిగా భావించి ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటున్నా’’ అని శ్రీవిష్ణు అన్నాడు.

శ్రీవిష్ణును మొద‌టి నుంచి ప్రోత్స‌హిస్తున్న అత‌డి మిత్రుడు.. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘సోలో సినిమా నుండి నాకు కుమార్ వ‌ట్టి ప‌రిచ‌యం. ‘మా అబ్బాయి’ క‌థ నాకు తెలుసు. చాలా మంచి స్కిప్ట్‌. శ్రీ విష్ణు నాకు స్నేహితుడు. మంచి ఆర్టిస్ట్‌. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంతో మంచి న‌టుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/