Begin typing your search above and press return to search.

అప్పట్లో ఒకడుండేవాడు.. జానరేంటో తెలియలేదట

By:  Tupaki Desk   |   28 Dec 2016 2:38 PM GMT
అప్పట్లో ఒకడుండేవాడు.. జానరేంటో తెలియలేదట
X
తాను హీరోగా నటించిన ఓ సినిమా పూర్తయ్యే వరకు అది ఏ జానరో అర్థం కాలేదు అంటున్నాడు యువ నటుడు శ్రీ విష్ణు. అతను ఈ మాటలు అంది ‘అప్పట్లో ఒకడుండేవాడు’ గురించే. ఈ సినిమా కాంప్లికేటెడ్ స్క్రిప్టుతో తెరకెక్కిందని.. అందుకే సినిమా పూర్తయ్యే వరకు తనకు దీని జానర్ ఏంటన్నది అర్థం కాలేదని శ్రీవిష్ణు తెలిపాడు.

‘‘సినిమా మొదలైనపుడు అసలిదే ఏ జానరో అర్థం కాలేదు. ఈ కథ ఒక రకంగా ఉండదు. అనేక అంశాలుంటాయి. సినిమా పూర్తయ్యాక మళ్లీ మళ్లీ చూసుకుంటే కానీ.. ఈ సినిమా ఏ కోవకు చెందుతుందో నాకు అవగాహన రాలేదు. అంతటి కాంప్లికేటెడ్ సబ్జెక్టుతో సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇదొక డిఫరెంట్ మూవీ. అదే సమయంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉండేలా ఈ కథను డీల్ చేశాడు సాగర్ చంద్ర. మా సినిమా నచ్చి పీవీపీ గారు మాకు అండగా నిలిచారు. సినిమా చూసి ఆయన చెప్పిన మాటలు విన్నాక మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సినిమా ఇది’’ అని శ్రీవిష్ణు తెలిపాడు.

ఇప్పటిదాకా చిన్నా చితకా పాత్రలే చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు.. నారా రోహిత్ లాంటి ఎస్టాబ్లిష్డ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో. ఇందులో అతడి పాత్ర భలే ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘అయ్యారే’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ శుక్రవారమే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/