Begin typing your search above and press return to search.

ప్లెజెంట్ ఫస్ట్ లుక్: మెంటల్ మదిలో

By:  Tupaki Desk   |   28 March 2017 10:32 AM GMT
ప్లెజెంట్ ఫస్ట్ లుక్: మెంటల్ మదిలో
X
పోయినేడాది చివర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చాడు శ్రీవిష్ణు. అతడిలో అంత టాలెంట్ ఉందని ఎవ్వరూ అనుకోలేదు. ఒక పెద్ద స్టార్ చేయాల్సినంత వెయిట్ ఉన్న ఆ పాత్రను అద్భుతంగా పండించాడతను. దీని తర్వాత అతడి నుంచి వచ్చిన ‘మా అబ్బాయి’ నిరాశ పరిచినప్పటికీ.. తాజాగా మరో ప్రామిసింగ్ సినిమా చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు.

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘మెంటల్ మదిలో’ ఫస్ట లుక్ రిలీజైంది. స్కూటీ మీద వెళ్తున్న మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు ఇందులో. అతడి లుక్ బాగుంది. పోస్టర్ చాలా అందంగా డిజైన్ చేశారు.టైటిల్.. ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే ఇదొక ప్లెజెంట్ ల‌వ్ స్టోరీలాగా క‌నిపిస్తోంది. చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగించేలా ఉంది ‘మెంటల్ మదిలో’ పోస్టర్.

ఇక ఈ చిత్ర విశేషాల విషయానికి వస్తే.. ‘పెళ్లిచూపులు’ సినిమాతో నిర్మాత‌గా త‌న అభిరుచిని చాటుకున్న రాజ్ కందుకూరి ‘ధర్మపథ క్రియేషన్స్’ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ‘ఓకే బంగారం’ సినిమాలో పాపుల‌రైన పాట‌లోని ప‌ల్ల‌విని తీసుకుని ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టుకున్నారు. ఇందులో కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోందట. ‘పెళ్లిచూపులు’ సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారినే ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/