Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: సైంటిఫిక్ ఎరోటికా అచ్చొస్తుందా?

By:  Tupaki Desk   |   24 Dec 2016 1:02 PM GMT
టీజర్ టాక్: సైంటిఫిక్ ఎరోటికా అచ్చొస్తుందా?
X
కథా రచయితగా వి విజయేంద్ర ప్రసాద్.. తన కొడుకైన దర్శకుడు రాజమౌళి సినిమా ద్వారా మాంచి సక్సెస్ నే కొట్టేశాడు. కాకపోతే ఆయన ఇతర దర్శకులకు అందించిన కథలూ.. అలాగే ఆయన డైరక్షన్లో రూపొందిన సినిమాలూ.. అన్నీ దాదాపు డిజాష్టర్లే. అందుకే చాలామంది క్రిటిక్స్ ఆయన దగ్గర్నుండి కేవలం రాజమౌళి ఒక్కడే పని సరిగ్గా రాబట్టుకుంటాడు అంటూ కామెంట్ చేస్తుంటారు.

అయితే బాహుబలి అండ్ బజరంగీ భాయ్జాన్ సక్సెస్ తరువాత మరోసారి డైరక్షన్ పగ్గాలు చేపట్టాలని ఫిక్సయిన విజయేంద్ర ప్రసాద్.. దాదాపు ఒక సంవత్సరం నుండి ''శ్రీవల్లి'' ఎరోటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఒకటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ అండే సైంటిఫిక్ ప్రయోగాల పేరుతో ఎరోటిక్ డోస్ ను ఇచ్చారని థ్రిల్లర్ చూస్తే అర్ధమైపోతుంది. మిస్ ఇండియా నేహా హింజే అందాలను బాగానే వాడేసుకున్నారు. అయితే గ్రాఫిక్స్ కాస్త నాసిరకంగా ఉండటం.. అలాగే సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లియర్ గా అర్దంకాకపోవడం ఈ టీజర్ కు బాగా మైనస్.

మరి ఈ మధ్యన కాస్త ఎరోటిక్ టచ్ ఇచ్చిన సినిమాలు హిందీలో కూడా పెద్దగా ఆడట్లేదు. తెలుగులో అయితే అస్సలు రావట్లేదు. ఈ క్రమంలో విజయేంద్రప్రసాద్ ఎటువంటి విజయం తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/