Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సూపర్ స్టార్ నయా అవతార్

By:  Tupaki Desk   |   19 Feb 2016 4:28 AM GMT
ట్రైలర్ టాక్: సూపర్ స్టార్ నయా అవతార్
X
సూపర్ స్టార్ కృష్ణ బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీకి రెడీ అవుతున్నారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆయన కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘శ్రీ శ్రీ’ విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం ఆడియో వేడుకలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకుముందు హీరో కెరీర్ ముగించబోతూ చెత్త చెత్త సినిమాలన్నీ చేసిన కృష్ణ.. ఈసారి మంచి కంటెంట్ ఉన్న సినిమానే ఎంచుకున్నట్లున్నారు. ఓ మరాఠీ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఓ రివెంజ్ డ్రామా అని.. ట్రైలర్ తో హింట్ ఇచ్చేశారు. కొన్ని ప్రతీకార కథలు ఎప్పటికీ పాతబడవు అన్న ట్యాగ్ లైన్ చూస్తేనే సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది అర్థమైపోతుంది.

తనకు జరిగిన అన్యాయం మీద పోరాటం మొదలుపెట్టిన ఓ పెద్ద మనిషి కథ ఇది. ‘‘సిస్టమ్ ఫెయిలైనపుడు సొసైటీ నుంచి నాలాంటి శ్రీశ్రీలే పుట్టుకొస్తార్రా’’ అంటూ కృష్ణ చెప్పే ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది ట్రైలర్లో. మిగతా అంతా బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే నడిపించారు. కృష్ణతో పాటు విజయనిర్మల - సాయికుమార్ - మురళీ శర్మ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. కృష్ణ గత సినిమాలతో పోలిస్తే ఇందులో గెటప్ చాలా కొత్తగా, బాగా అనిపిస్తోంది. ఫైట్లు అవేమీ లేకుండా థ్రిల్లర్ తరహాలో సినిమాను రూపొందించినట్లున్నారు. సీనియర్ డైరెక్టర్ ముప్పలనేని శివ ఈ చిత్రానికి దర్శకుడు. మార్చిలోనే ‘శ్రీ శ్రీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.