Begin typing your search above and press return to search.

కీరవాణి తనయుడి 'భాగ్ సాలే' షూటింగ్ ప్రారంభం..!

By:  Tupaki Desk   |   25 Oct 2021 11:30 PM GMT
కీరవాణి తనయుడి భాగ్ సాలే షూటింగ్ ప్రారంభం..!
X
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''భాగ్ సాలే''. ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్.. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు.

'మత్తు వదలరా' 'తెల్లవారితే గురువారం' వంటి వైవిధ్యమైన చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో చిత్రం “భాగ్ సాలే”. అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమా - సినీ వ్యాలీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

యష్ రంగినేని - శింగనమల కళ్యాణ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అశ్వత్థామ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ''భాగ్ సాలే'' చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. సుందర్ రామ్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సత్య గిడుటూరి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. శృతి నూకల ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రంలో జాన్ విజయ్ - రాజీవ్ కనకాల - వెన్నెల కిషోర్ - నందినీరాయ్ - సుదర్శన్ - వంశీ నెక్కంటి - వైవా హర్ష - కిడ్ చక్రి - జయవాణి - బాష - యాదం రాజు తదితరులు నటిస్తున్నారు.

ఇకపోతే శ్రీ సింహా హీరోగా నటిస్తున్నారు 'దొంగలున్నారు జాగ్రత్త' చిత్రాన్ని కూడా మరో నిర్మాతతో కలిసి డి. సురేష్ బాబు నిర్మిస్తున్నారు. సతీష్ త్రిపుర ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు.