Begin typing your search above and press return to search.

కేసీఆర్‌..స్పందించ‌క‌పోతే ప‌బ్లిక్‌ లో న‌గ్నంగా నిల‌బ‌డ‌తా

By:  Tupaki Desk   |   6 April 2018 7:46 AM GMT
కేసీఆర్‌..స్పందించ‌క‌పోతే ప‌బ్లిక్‌ లో న‌గ్నంగా నిల‌బ‌డ‌తా
X

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. గత కొంతకాలంగా తెలుగు సిని పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయింద౦టు సంచలన ఆరోపణలు చేస్తున్న వర్ధమాన నటి శ్రీరెడ్డి కొద్దిరోజులుగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. మొన్న బడా ప్రొడ్యుసర్ రమేష్ పుప్పాల, నిన్న శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఇండియన్ ఐడల్ విన్నర్ - సింగర్ శ్రీరామ్ చేరడం సంచలనం రేపుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని సంచలన ప్రకటన చేసింది.

కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఇండస్ట్రీ పెద్దల్లో గుబులు రేపుతున్న శ్రీరెడ్డి తాజాగా కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. ‘‘కేసీఆర్ మీరు మా బాధ అర్థం చేసుకోకపోతే - మీరు ఏ నిరాహార దీక్షనైతే చేసి సక్సెస్ అయ్యారో....నేను కూడా దాన్ని చేస్తా. మీరు అప్పటికీ పట్టించుకోకుంటే - అప్పుడు నేను నెక్ట్స్ స్టెప్ తీసుకుంటా. పబ్లిక్‌లో న్యూడ్‌ గా నిలబడతా...సర్.. ప్లీజ్ విషయం తెలుసుకోండి. మిమ్మల్ని ఎలా కలవాలో నాకు తెలియట్లేదు సార్’’ అంటూ ఫేస్‌ బుక్‌ లో పెట్టింది.