Begin typing your search above and press return to search.
వైవా హర్షపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 8 April 2018 11:51 AM ISTనిన్న ఫిల్మ్ చాంబర్ ముందు నటి శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఆందోళన తర్వాత టాలీవుడ్ లో తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలీదని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. గతంలో పరోక్షంగా శేఖర్ కమ్ముల - నేచురల్ స్టార్ అంటూ మరో హీరో - ఇండియన్ ఐడల్ - సింగర్ శ్రీరామచంద్రలపై శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనతో శ్రీరామచంద్ర వాట్సాప్ లో అసభ్యకరంగా చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో శ్రీరెడ్డి పోస్ట్ చేసిన విషయం విదితమే. తాజాగా, యూట్యూబ్ సెలబ్రిటీ వైవా హర్షపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. వివా హర్ష తనతో అసభ్యకరంగా చాట్ చేశాడని ఆమె ఆరోపించింది. వైవా హర్షతో తాను చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
సినిమాల్లో అవకాశాలు రాకపోతే...షార్ట్ ఫిల్మ్స్ లో నటించవచ్చుగా అని తనకు కొందరు ఉచితసలహాలిచ్చారని, అక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఉందని శ్రీరెడ్డి ఆరోపించింది. తనకు షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు ఇప్పించమని వివా హర్షను అడిగానని....ఆ సమయంలో అతడు తనతో వాట్సాప్ లో అసభ్యకరంగా చాట్ చేసిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేసింది. `` ది గ్రేట్ వైవా హర్ష. యూట్యూబ్ చానెళ్లు - షార్ట ఫిల్మ్స్ లో నాకు అవకాశాలు ఇప్పించమని అడినపుడు నాతో ఇలా చాట్ చేశాడు. చిన్న చిన్న నటులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏదైనా చేసుకొని బ్రతకొచ్చుగా అన్నవారికి ఇదే నా సమాధానం. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, చిన్న ప్రాజెక్టులలో నటించేందుకు కూడా నేను నావంతు ప్రయత్నం చేశాను. కానీ, ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంది.`` అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఫేజీలో తాజాగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.