Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డిని రెండు పార్టీలు రమ్మంటున్నాయట!
By: Tupaki Desk | 15 Sept 2018 1:17 PM ISTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం నటి శ్రీరెడ్డికి మామూలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్నట్లుగా తెర మీదకు వచ్చిన ఆమె.. తర్వాతి కాలంలో ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ కాస్తా.. విషయం ఎక్కడికెక్కడికో వెళ్లిపోవటమే కాదు.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లిన శ్రీరెడ్డి కారణంగా మూడు రాష్ట్రాల్లోనూ టీవీ ఛానళ్లకు చేతి నిండా పని దొరికిన పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లో ఒక బేకరీని ఓపెన్ చేయటానికి వచ్చిన ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరే తాజా సందర్భంలోనూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను రెండు రాజకీయ పార్టీలు రమ్మని కోరుతున్నాయని.. కానీ తనకు ఇప్పటికైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదన్న ఆమె.. పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో ఏపీలో వచ్చే సీట్ల లెక్కను చెప్పటం గమనార్హం.
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్న ఆమె.. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ జనసేనకు ఘోర పరాజయం తప్పదన్నారు. కేవలం మూడు.. లేదంటే నాలుగు సీట్లలో మాత్రమే పవన్ పార్టీ గెలుస్తుందని.. మిగిలినచోట్ల ఓడిపోవటం ఖాయమన్నారు. రాజకీయాల గురించి ఆసక్తి లేదంటూనే.. పవన్ పార్టీకి వచ్చే సీట్ల లెక్కను శ్రీరెడ్డి చెప్పిన తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.