Begin typing your search above and press return to search.

బిగ్ బాస్-2లో శ్రీరెడ్డి ఎందుకు లేదంటే..?

By:  Tupaki Desk   |   3 Jun 2018 10:09 AM GMT
బిగ్ బాస్-2లో శ్రీరెడ్డి ఎందుకు లేదంటే..?
X
బిగ్ బాస్ రెండో సీజన్ సన్నాహాలు మొదలైన రోజు నుంచి ఈసారి షోలో శ్రీరెడ్డి పాల్గొనబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఆ షోలో పాల్గొంటే వివాదాలకు లోటుండదని.. షో రంజుగా సాగుతుందని భావించారు. ఇటు షో నిర్వాహకులకు.. అటు శ్రీరెడ్డికి ఇది ఉభయ తారకంగా ఉంటుందని భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీరెడ్డి ‘బిగ్ బాస్-2’లో పాల్గొనట్లేదట. అందుకు కారణం హోస్ట్ నానీనే అని సమాచారం. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. నానీని కూడా వదల్లేదు. నేరుగా అతడి పేరు పెట్టే ఆరోపణలు చేసింది ఒక దశలో. అతడి సంగతేంటో చూస్తానని హెచ్చరించింది. ఆ తర్వాత ఏ వివరాలూ వెల్లడించనప్పటికీ తనను అంత మాట అన్నాక నాని ఆమెతో కలిసి షో ఎలా చేస్తాడు?

‘బిగ్ బాస్’ హౌస్‌ లో నాని గురించి శ్రీరెడ్డి ఏమైనా అంటే మొత్తం షోనే తేడా కొట్టేస్తుంది. అందుకే ఆమెను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘బిగ్ బాస్-2’లో పాల్గొనబోయే పార్టిసిపెంట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లే తెలుస్తోంది. రాజ్ తరుణ్.. వరుణ్ సందేశ్.. ఆర్యన్ రాజేష్.. సీనియర్ హీరోయిన్ రాశి.. శ్రీదేవి విజయ్ కుమార్.. గజాలా.. ధన్య బాలకృష్ణన్.. చాందిని చౌదరి.. సింగర్ గీతా మాధురి.. యాంకర్లు లాస్య.. శ్యామల.. కమెడియన్లు వైవా హర్ష.. వేణు.. బిత్తిరి సత్తిల పేర్లను పార్టిసిపెంట్లుగా ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లోనే ఈ విషయంలో స్పష్టత రానుంది. జూన్ 10న బిగ్ బాస్-2 ఆరంభం కాబోతున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్లో 70 రోజులకే పరిమితం అయిన షో.. ఈసారి వంద రోజుల పాటు నడవనున్న సంగతి తెలిసిందే.