Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డి రేంజ్ చెప్పిన వ‌ర్మ‌

By:  Tupaki Desk   |   8 April 2018 9:20 AM GMT
శ్రీ‌రెడ్డి రేంజ్ చెప్పిన వ‌ర్మ‌
X
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు.. ఆ మాట‌కు వ‌స్తే దేశంలో మ‌రే వుడ్ కు చెందిన న‌టి కూడా చేయ‌ని ప‌నితో సంచ‌ల‌నంగా మారారు శ్రీ‌రెడ్డి. సినీ ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ భూతం మీద ఓపెన్ గా మాట్లాడ‌ట‌మే కాదు.. త‌న‌ను ఎంతో మంది వాడుకొని వ‌దిలేశార‌ని.. త‌న‌ను మోసం చేశారంటూ ఆమె చెప్పిన మాట‌లు ఇప్పుడు ఎక్క‌డ చూసినా చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. మా స‌భ్య‌త్వం కోసం ఆమె ఫిలిం ఛాంబ‌ర్ ఎదుట అర్థ‌న‌గ్నంగా నిర‌స‌న తెలియ‌జేయ‌టంతో టాలీవుడ్ లో మాత్ర‌మే కాదు.. జాతీయ‌స్థాయిలోనూ శ్రీ‌రెడ్డి చ‌ర్చ షురూ అయ్యింది. శ్రీ‌రెడ్డి చ‌ర్య‌తో ఎక్క‌డ చూసినా ఆమె గురించిన చ‌ర్చే సాగుతుంది. ఇక‌.. సోష‌ల్ మీడియాతో పాటు.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆమె ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వార్త‌లు షేర్ మీద షేర్ అవుతున్నాయి.

ఇలాంటివేళ‌.. శ్రీ‌రెడ్డి చ‌ర్య‌పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. శ్రీ‌రెడ్డి జాతీయ స్థాయిలో సెల‌బ్రిటీగా ఎదుగుతోంద‌ని.. ముంబ‌యిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి తెలియ‌ని వారు సైతం శ్రీ‌రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నార‌న్నారు.

ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న‌మైతే.. ఆమెకు సంబంధించి ట్వీట్ పెట్ట‌టం ద్వారా వ‌ర్మ మరోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఓవైపు శ్రీ‌రెడ్డి గురించి మాట్లాడేందుకు.. ఆమె వ్య‌వ‌హారంపై స్పందించేందుకు సినీ ప్ర‌ముఖులు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌ని వేళ‌.. వ‌ర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.