Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 2లో శ్రీరెడ్డి.. ఇదిగో ఫ్రూఫ్..

By:  Tupaki Desk   |   5 Jun 2018 4:56 AM GMT
బిగ్ బాస్ 2లో శ్రీరెడ్డి.. ఇదిగో ఫ్రూఫ్..
X
బిగ్ బాస్ సీజన్ 2కు అంతా సిద్ధమైంది. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి స్టార్ మా టీవీ ఏర్పాట్లు చేస్తోంది. నిన్న నాని, మాటీవీ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ విలేకరుల ముందుకు వచ్చి సినిమా విశేషాలు పంచుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1ను పీక్ స్టేజ్ కి తీసుకెల్లిన ఎన్టీఆర్ ఈ సారి డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో షోను హోస్ట్ చేయడం లేదని అలోక్ జైన్ వివరించారు. అన్నీ ఆలోచించాకే నాని అయితే సూటవుతుందని సెలెక్ట్ చేశామని ఆయన తెలిపారు.

ఇక నాని కూడా బిగ్ బాస్ ను తాను ఇంతవరకూ చూడలేదని.. మాటీవీ వాళ్లు సంప్రదించాకే షో గురించి తెలుసుకున్నానని అన్నారు. ఎన్టీఆర్ ను మరిపించేలా.. అంతకంటే ఎక్కువే చేస్తానని హామీ ఇచ్చారు. ఇంత గ్రాండ్ జరిగిన ఈ సమావేశంలో పాల్గొనే సెలబ్రెటీల పేర్లు మాత్రం రివీల్ చేయలేదు..

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్2లో పాల్గొనే 16 మంది సెలబ్రిటీలు వీళ్లేనట చాలా పేర్లు బయటకు వచ్చాయి. దీనిపై మాటీవీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా శ్రీరెడ్డి చేసిన పోస్టుతో ఆమె కూడా బిగ్ బాస్ లో పాల్గొననుందని స్పష్టమైంది.

శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేసింది.. ‘నాని కి.. నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది.. ఏం చేద్దాం నాని మరి.?’ అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్టు వైరల్ గా మారింది.. దీన్ని బట్టి శ్రీరెడ్డి బిగ్ బాస్ సీజన్ 2లో సెలబ్రెటీగా పాల్గొనబోతోందని కన్ఫం అయ్యింది.