Begin typing your search above and press return to search.

కమ్ములపై శ్రీరెడ్డి ప్లేటు ఫిరాయించేసిందే

By:  Tupaki Desk   |   5 April 2018 9:33 AM IST
కమ్ములపై శ్రీరెడ్డి ప్లేటు ఫిరాయించేసిందే
X
శేఖర్ కమ్ముల పేరు పెట్టలేదు కానీ.. ఆయన పేరు ధ్వనించేలా సంచలన ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. ఐతే తన గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటుండే సరికి కమ్ముల ఆగలేదు. శ్రీరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆమెకు లీగల్ నోటీస్ ఇవ్వబోతున్నట్లు కూడా ప్రకటించాడు. సారీ కూడా డిమాండ్ చేశాడు. దీనిపై శ్రీరెడ్డి కూడా స్పందించిన సంగతి తెలిసిందే. తాను కమ్ముల పేరు పెట్టి అనలేదని.. ఆయనెందుకు భుజాలు తడుముకుంటున్నాడని ఆమె అంది. నువ్వు కమ్ముల అయితే ఏంటి.. నీకు డబ్బులుంటే ఏంటి అంటూ ఎదురుదాడి చేసింది.

ఐతే సాయంత్రానికి ఒక టీవీ ఛానెల్లో కూర్చున్న శ్రీరెడ్డి మాట మార్చేసింది. తాను శేఖర్ కమ్ములను ఉద్దేశించి ఏమీ అనలేదని.. ఆయనకు వ్యతిరేకంగా తన దగ్గర ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది. తాను అరవింద్-2 అనే సినిమాలోనూ నటించానని.. ఆ చిత్ర దర్శకుడి పేరు కూడా శేఖరే అని ఆమె అంది. మరి ఎందుకు శేఖర్ కమ్ముల పేరు ధ్వనించేలా వ్యాఖ్యలు చేశావని అడిగితే.. తన ఫేస్ బుక్ పేజీ తన ఇష్టమని.. ఏమైనా రాస్తానని.. దానిపై ఎవరైనా ఎలా క్వశ్చన్ చేస్తారని ఆమె అంది. తాను శేఖర్ కమ్ముల నుంచి లీగల్ నోటీసు అందుకున్నట్లు ఈ సందర్భంగానే శ్రీరెడ్డి వెల్లడించింది. దానిపై ఏం చేయబోయేది మాత్రం ఆమె చెప్పలేదు. ఐతే సినీ పరిశ్రమలోని పెద్దలపై తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసింది.