Begin typing your search above and press return to search.

సురేష్ బాబు కొడుకు పేరు చెప్పిన శ్రీరెడ్డి

By:  Tupaki Desk   |   10 April 2018 4:51 PM GMT
సురేష్ బాబు కొడుకు పేరు చెప్పిన శ్రీరెడ్డి
X
టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించడమే పరమావధిగా భావిస్తున్న శ్రీరెడ్డి.. ఇప్పటికే సెమీ న్యూడ్ షో చేసి సెన్సేషన్ సృష్టించింది. తన దగ్గర చాలామందికి చెందిన సాక్ష్యాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్న ఈమె.. ఇప్పటివరకూ పలువురు చిన్నవాళ్ల పేర్లను నేరుగాను.. పెద్దోళ్ల పేర్లను ఇన్ డైరెక్టుగాను చెప్పింది.

స్టూడియోలు బ్రోతల్ హౌస్ లుగా మారిపోయాయంటూ గతంలో ఈమె చేసిన కామెంట్ పై చాలానే చర్చ జరిగింది. ఈ అంశంపై పలు డిస్కషన్స్ జరుగుతూ ఉండగా.. ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ CNN News18తో మాట్లాడుతూ.. తన బ్రోతల్ హౌస్ కామెంట్ ఒక ప్రముఖ స్టూడియోస్ గురించి అనేసింది శ్రీరెడ్డి. తనను ఓ బడా నిర్మాత కొడుకు మోసం చేశాడనే కామెంట్ తో పాటు.. అతను ఎవరో కాదని.. నిర్మాత సురేష్ బాబు కొడుకు అని చెప్పేసింది శ్రీరెడ్డి. "He f***ed me badly in the studio only" అంటూ కామెంట్ చేసింది. మరి స్టూడియో ఉన్న సురేష్‌ బాబు అంటే ఎవరో వేరే చెప్పక్కర్లేదు. ఆయనకు ఇద్దరు కొడుకులు కాబట్టి.. వారిలో ఎవరో శ్రీరెడ్డే చెప్పాలి.

అయితే శ్రీరెడ్డి చెప్పినదంతా నిజమేనా? అందుకు తన దగ్గర ప్రూఫులు ఉన్నాయంటోంది. అయితే నిజానికి అలా లోబర్చుకున్న వారెవరైనా శ్రీరెడ్డిని వీడియోలు తీసుకోనిస్తారా? ఫోటోలు తీసుకోనిస్తారా? ఆ విధంగా ప్రూఫ్ లు ఉండినిస్తారా? కాని అక్కడ మరో మ్యాటర్ కూడా ఉంది.. అసలు నువ్వెందుకు అతనితో సెక్స్ చేశావ్.. 'నో' అని చెప్పి ఉండొచ్చుకదా అంటే.. ''నాకు అవకాశాలు కావాలి కాబట్టి.. నేను పడుకున్నా. కాని సెక్స్ చేశాక కూడా ఛాన్సులు ఇవ్వలేదు'' అని చెప్పింది ఈ నటీమణి. చూద్దాం తెలుగు ఇండస్ర్టీ పెద్దలు ఏమంటారో!!

వీడియో కోసం క్లిక్ చేయండి