Begin typing your search above and press return to search.

చెప్పి చెప్పకుండా ఎందుకీ నాన్చుడు?

By:  Tupaki Desk   |   22 March 2018 10:21 AM GMT
చెప్పి చెప్పకుండా ఎందుకీ నాన్చుడు?
X
ఏదైనా విష‌యాన్ని చెప్పి, చెప్ప‌న‌ట్టు చెబితే ఎలా ఉంటుంది? ''అలాంట‌ప్పుడు ఎందుకు మొద‌లెట్టారు రా... జ్యోతిల‌క్ష్మీ డాన్స్ చేసిన‌ట్టు క‌నిపించీ, క‌నిపించ‌కుండా... వినిపించీ, వినిపించ‌కుండా చెప్పేసి వ‌దిలేస్తే ఎలా'' అని ‘అత‌డు’ సినిమాలో ఎమ్మెస్ నారాయ‌ణ‌లా చిర్రెత్తుకొచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానల్స్ చూస్తున్న‌వారిదీ సేమ్ ఇదే ప‌రిస్థితి.

అవ‌కాశాలిస్తామ‌ని ఆశ చూపి.. తెలుగు హీరోయిన్ల‌ను వాడుకుని వ‌దిలేస్తున్నార‌ని నటి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత న్యూస్ ఛాన‌ళ్ల‌ను ఈవైపు మ‌ళ్లాయి. తెలుగులో ఓ బ‌డా నిర్మాత కొడుకు కామంధుడ‌ని... వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ద‌ర్శ‌కుడికి ఎప్పుడూ అదే యావ‌! అని... కొన్ని న్యూస్ ఛాన‌ళ్లు ప‌లు క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. దీనికి వాళ్లు స్టింగ్ ఆప‌రేష‌న్ చేశామ‌ని గొప్ప‌లు కూడా చెప్పుకుంటున్నారు. పోనీ ఆ నిర్మాత కొడుకు ఎవ‌రో? ఆ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎవ‌రో పేరు చెప్పేస్తారా అంటే అదీ లేదు. కొన్ని ర‌కాల క్లూస్ ఇచ్చి, వాళ్లెవ‌రూ మీరే ఊహించుకోండి అన్న‌ట్టు ప్రేక్ష‌కుడికి వ‌దిలేస్తున్నారు. ఇదే తెలుగు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతోంది.

డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న‌ప్పుడు సినీ న‌టుల పేర్ల‌న్నీ బ‌య‌టికి వ‌చ్చేశాయి. ఎక్క‌డా ఏ ర‌హ‌స్యం లేకుండా విచార‌ణ జ‌రిగింది. మ‌రి ఇప్పుడు మాత్రం ఇంత గోప్య‌త ఎందుకు పాటిస్తున్నారు. ఇలా చెప్పీ చెప్ప‌కుండా ప్ర‌సారం చేసే క‌థ‌నాల వ‌ల్ల అమాయ‌కులైన ద‌ర్శ‌క‌నిర్మాతల మీద కూడా ప్ర‌జ‌ల్లో అనుమానాలు రెక్కెత్తుండ‌డం విశేషం. నాన్చకుండా మ్యాటర్ తేల్చేయండి గురూ. అది టివి ఛానల్ అయినాసరే.. క్యాస్టింగ్ కౌచ్ అంటూ రచ్చ చేస్తున్న భామలైనా సరే.