Begin typing your search above and press return to search.

భలే కాంబినేషన్ తెరమీదికొస్తోంది

By:  Tupaki Desk   |   14 March 2016 3:14 PM IST
భలే కాంబినేషన్ తెరమీదికొస్తోంది
X
గత ఏడాది ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టిచ్చాడు నాని. ఈ యువ కథానాయకుడి కెరీర్ ఆ సినిమాతోనే మలుపు తిరిగింది. ఇప్పుడు నాని రేంజే వేరు. అతడి కోసం కనీసం అరడజను మంది దర్శకులైనా స్క్రిప్టు రెడీ చేస్తుంటారు ఇప్పుడు. ఐతే నాని మాత్రం ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. వైవిధ్యమైన కథలకే ఓటేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించిన నాని.. ప్రస్తుతం తన గాడ్ ఫాదర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. దీని తర్వాత ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ డైరెక్షన్ లోనూ ఓ సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే పూర్తి చేయబోతున్న నాని.. ఆ తర్వాతి సినిమాకు కూడా రంగం సిద్ధం చేసేస్తున్నాడు.

గత ఏడాది ఆఖర్లో ‘భలే మంచి రోజు’తో దర్శకుడిగా టాలీవుడ్ లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఇచ్చాడు శ్రీరామ్ ఆదిత్య. అతను తన తర్వాతి సినిమాను నానితోనే చేయబోతున్నట్లు సమాచారం. ముందు రవితేజ శ్రీరామ్ తో సినిమాకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ మాస్ రాజా తన కమిట్మెంట్ల నుంచి ఫ్రీ కావడానికి ఆలస్యమయ్యే అవకాశముండటంతో ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టకు పక్కకు వెళ్లింది. ఈ సమయంలోనే నానికి ఓ కథ చెప్పి ఒప్పించాడు శ్రీరామ్. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం పూర్తి స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నాడు శ్రీరామ్.