Begin typing your search above and press return to search.

మనసారా నాకో ఛాన్సివ్వడండి ప్లీజ్

By:  Tupaki Desk   |   16 May 2018 9:00 AM IST
మనసారా నాకో ఛాన్సివ్వడండి ప్లీజ్
X
మనసారా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి శ్రీ దివ్య. హనుమాన్ జంక్షన్ - వీడే వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ చిన్నది అనుకోకుండా రవిబాబు మనసారా సినిమాతో మొదటి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసిరాకపోయినా తరువాత బస్ స్టాప్ అనే సినిమాతో మంచి హిట్ అందుకొని ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ తరువాత తమిళ్ సినిమాలతో ఆఫర్స్ అందుకుంది.

అప్పుడపుడు తెలుగును టచ్ చేస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ అందకపోవడంతో ఎక్కువగా తమిళ్ సినిమాలతోనే బిజీ అవుతోంది. ఇకపోతే రీసెంట్ గా ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకనిర్మాతలపై కొన్ని కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలను నిర్మించే వారు కొంచెం తెలుగమ్మాయిలకు కూడా అవకాశం ఇస్తే బావుంటుందని కౌంటర్ ఇచ్చింది. ఇటీవల కాలంలో శ్రీ రెడ్డి - మాధవీలత వంటి వారు అదే తరహాలో నిరసన వ్యక్తం చేశారు.

శ్రీ దివ్య తెలుగులో నటించిన చివరి సినిమా కేరింత. సైజ్ జీరో సినిమాలో అలా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తమిళ్ సినిమాలతో బిజీ అయినా ఈ చిన్నది తెలుగును మర్చిపోయిందా ఏమిటా అని అనుకునే లోపే ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి నేను కూడా నటిస్తాను అని చెబుతోంది. పైగా గ్లామర్ గేట్లు తెరవడానికి మేము కూడీ రెడీ అని చెబుతోంది. ప్రస్తుతం శ్రీ దివ్య కోలీవుడ్ లో అథర్వాతో ఒక సినిమా చేస్తోంది.