Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్లకు కళ్లు తెరిపించింది
By: Tupaki Desk | 10 Dec 2015 4:22 AM GMTజాలి - దయ - కరుణ లేని స్టార్లు అంటూ ఓ వైపు రామ్ గోపాల్ వర్మ అందరినీ చెడా మడా తిట్టేస్తున్నాడు. పవన్ - రజనీకాంత్ లనే టార్గెట్ చేశాడు వర్మ. పెద్ద స్టార్లంతా లక్షల్లో డొనేట్ చేస్తూ చెన్నయ్ బాదితులకు భిక్షం వేస్తున్నారంటూ సూటి పోటి మాటలతో చెడుగుడు ఆడేశాడు. మరి ఇలాంటి టైమ్ లో వరద బాధితులకు స్టార్ హీరోయిన్ లు చేసిన సాయమేంటి? అని ఆరాతీస్తే .. అస్సలు పిల్లికి భిక్షం వేయని పిసినారి నాయికలుగా తేలిపోయారు.
స్టార్ హీరోలైతే లక్షల్లో విదిలించి అర్రే అనిపిస్తే.. నయనతార - త్రిష - అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ లు కోట్లకు కోట్లు నొక్కేస్తూ గప్ చుప్ మని ఉండటం పెద్ద రేంజులో చర్చకొచ్చింది. అయితే వీళ్లందరికీ బుద్ధి నేర్పేందుకే అన్నట్టు నవతరం కథానాయిక శ్రీదివ్య పెద్ద మనసు చాటుకునే ప్రయత్నం చేసింది. బస్ స్టాప్ - మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు - మనసారా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శ్రీదివ్య ఆ తర్వాత తమిళ పరిశ్రమకి వెళ్లిపోయి అక్కడ విజయబావుటా ఎగురవేసింది. వరుసగా విజయాలు అందుకుంటూ తన గ్రాఫ్ పెంచుకుంటోంది. ఇటీవలే త్రిష ఇలియానా నయనతార అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ అమ్మడు అందుకునే పారితోషికం కేవలం లక్షల్లోనే ఉంటుంది. అయినా చెన్నయ్ వరదలకు స్పందించి ఏకంగా రూ.10 లక్షలు డొనేట్ చేసింది.
ఇది నమ్మశక్యం కానిది. తనని ఆదరించిన ప్రేక్షకాభిమానుల కోసం ఆ మాత్రం చేస్తే తప్పేంటి? అని తన దాతృత్వం చాటుకుంది శ్రీదివ్య. అనుష్క - త్రిష - ఇలియానా - నయనతార .. ఇంత మందికి సిగ్గు చేటు. కోట్లు దండుకుంటూ లక్షల్లో భిక్షం వేస్తున్నారేంటి? అని వర్మ అడగడం లో తప్పేం లేదని ప్రూవైంది మరి.