Begin typing your search above and press return to search.

మళ్ళీ అమ్మగా శ్రీదేవి

By:  Tupaki Desk   |   4 March 2016 1:30 AM GMT
మళ్ళీ అమ్మగా శ్రీదేవి
X
అతిలోక సుందరి అనగానే శ్రీదేవి అని అర్ధమైపోతుంది కానీ.. శ్రీదేవి మూడోసారి అమ్మ కాబోతున్నది మాత్రం రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో రీఎంట్రీ తర్వాత వరుసగా మూడోసారి కూడా అమ్మ రోల్ లో కనిపించనుంది శ్రీదేవి. ఇంగ్లీష్ వింగ్లీష్ తన రీ ఎంట్రీని గ్రాండ్ గానే స్టార్ట్ చేసినా, తర్వాత పులి మాత్రం ఈ సీనియర్ సుందరిని బాగానే కరిచింది. అందుకే ఇప్పుడు ప్రాజెక్టుల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందీ మాజీ అందాల తార.

ప్రస్తుతం 'మామ్' అనే మూవీకి శ్రీదేవి సైన్ చేసింది. రవి ఉద్యవర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పై చాలానే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ మూవీలో లీడ్ రోల్ అయిన మదర్ పాత్ర కోసం చాలామందిని అడిగినా.. ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. శ్రీదేవి మాత్రం రవి చెప్పిన స్క్రిప్ట్, కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. ది లంచ్ బాక్స్, బద్లాపూర్ చిత్రాల్లో నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ.. 'మామ్'లో మరో కీలక పాత్ర పోశించనున్నాడు.

'మామ్' స్టోరీ శ్రీదేవి ఫ్యామిలీకి ఎంతగా నచ్చిందంటే.. ఈ చిత్రాన్ని స్వయంగా బోనీకపూర్ నిర్మించనుడడం విశేషం. తల్లి పాత్రలో కనిపించేందుకు శ్రీదేవి కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. రియల్ లైఫ్ లో ఇద్దరు టీనేజర్లకు తల్లి అయిన శ్రీదేవి.. ఇలా వరుసగా తన మూడో సినిమాలో అమ్మగా నటిస్తోంది.