Begin typing your search above and press return to search.

వెన్నెల కిషోర్‌ పై పెద్ద బాధ్యత పెట్టనున్న వైట్ల

By:  Tupaki Desk   |   30 July 2020 9:30 AM GMT
వెన్నెల కిషోర్‌ పై పెద్ద బాధ్యత పెట్టనున్న వైట్ల
X
దూకుడు చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ల జాబితాలో చేరిపోయిన శ్రీనువైట్ల ఆ తర్వాత చేస్తున్న సినిమాలతో తన స్థాయిని ఆయనే తగ్గించుకుంటూ వస్తున్నాడు. దూకుడు తర్వాత ఇప్పటి వరకు సరైన సక్సెస్‌ పడక పోవడంతో వైట్ల కెరీర్‌ కష్టాల్లో పడ్డట్లయ్యింది. వైట్ల కెరీర్‌ లో సూపర్‌ హిట్‌ గా నిలిచిన ‘ఢీ’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ రెడీ అవుతోంది. గత కొన్నాళ్లుగా ఢీ సీక్వెల్‌ కు స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మంచు విష్ణు ప్రత్యేక ఆసక్తితో ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడు.

ఢీ సీక్వెల్‌ కు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. సీక్వెల్‌ లో కూడా మంచు విష్ణు నటించబోతున్నాడు. ఢీ లో మంచు విష్ణు తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్రలను బ్రహ్మానందం మరియు శ్రీహరిలు చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర కామెడీ ఇప్పటికి కూడా మర్చి పోలేకుండా ఉన్నాం. అలాంటి పాత్ర ఢీ సీక్వెల్‌ లో కూడా ఉంటుందట. అయితే బ్రహ్మానందంను కాకుండా ఆ పాత్రలో వెన్నెల కిషోర్‌ ను నటింపజేయాలని భావిస్తున్నారట.

కమెడియన్‌ గా ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను చేసిన వెన్నె కిషోర్‌ ఖచ్చితంగా చారి పాత్రకు సూట్‌ అవుతాడని మంచు విష్ణు నమ్ముతున్నాడు. తన ఎక్కువ శాతం సినిమాల్లో వెన్నెల కిషోర్‌ ను నటింపజేస్తున్న మంచు విష్ణు ఢీ సీక్వెల్‌ లో కూడా ఆ పాత్రకు వెన్నెల కిషోర్‌ ను సిఫార్సు చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోతున్న ఈ సీక్వెల్‌ వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొదటి పార్ట్‌ సూపర్‌ హిట్‌ కనుక ఢీ సీక్వెల్‌ కు మంచి హైప్‌ అయితే ఉంటుంది. మంచు విష్ణు వెన్నెల కిషోర్‌ లు మంచి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందిస్తే ఖచ్చితంగా సినిమా హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.