Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మ‌ణులు పెట్టిన కేసుపై యాంకర్ శ్రీముఖి రియాక్షన్...!

By:  Tupaki Desk   |   7 May 2020 1:30 AM GMT
బ్ర‌హ్మ‌ణులు పెట్టిన కేసుపై యాంకర్ శ్రీముఖి రియాక్షన్...!
X
'జులాయి' సినిమాతో వెండితెరకు పరిచయమైన శ్రీముఖి తరువాత బుల్లితెర మీద యాంకర్‌ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తను హోస్ట్ చేసే షోలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో యూత్ ని బాగా అట్రాక్ట్ చూస్తూ ఉంటుంది. స్మాల్‌ స్క్రీన్‌ రాములమ్మగా పాపులర్‌ అయిన ఈ బ్యూటీ.. బిగ్‌ బాస్‌ షోలోనూ పాల్గొంది. ఈ షో చివరకు వరకు నిలిచి రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన తరువాత శ్రీముఖి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇదే ఊపులో తాజాగా ఈమె మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ అవార్డును సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఒక టీవీ షోలో బ్ర‌హ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్యాఖ్యలు చేసిందంటూ న‌టి శ్రీముఖిపై కేసు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే. వాస్తవానికి శ్రీముఖి లాంటి యాంకర్స్ చేసే షోలు ఫ్యామిలీతో కూర్చొని చూసేలా ఉండవు. డబుల్ మీనింగ్ డైలాగ్స్..దిగువ స్థాయి మాట‌లతో షోని నింపేస్తూ వస్తుంటారు. అయితే జ‌నాలు వాటినే చూస్తున్నార‌ట‌.. అందుకే టీవీ ఛాన‌ళ్లు కూడా వాటినే ప్ర‌సారం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా అలాంటి షో ఒక దానితో యాంక‌ర్ శ్రీముఖి ఒక ఎపిసోడ్‌ లో బ్రాహ్మణుల గౌరవాన్ని తగ్గించేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ ఆమెపై కేసు నమోదైంది. ఈ క్ర‌మంలో ఈ వ్య‌వ‌హారంపై శ్రీముఖి స్పందించింది.

ఒక ప్రముఖ న్యూస్ పేపర్ తో ఈ విషయంపై వివరణ ఇచ్చిందట. త‌న‌పై కేసు చెల్ల‌ద‌ని శ్రీముఖి అంటోంద‌ట‌. త‌ను యాంక‌ర్ మాత్ర‌మేన‌ని అంటోంద‌ట‌. అలాగే ఆ టీవీ షో కూడా ఇప్ప‌టిది కాదు అనేది శ్రీముఖి మాట‌. రెండేళ్ల కింద‌ట షూట్ చేసి.. అప్ప‌ట్లోనే ప్ర‌సారం చేసిన వ్య‌వ‌హారంపై ఇప్పుడు కేసేంట‌ని అంటోంద‌ట శ్రీముఖి. లాక్‌ డౌన్ సమయంలో కొన్ని షోలు పున: ప్రసారం అవుతున్నాయి. ఈసారి చూసిన వారు ఎవ‌రో అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ శ్రీముఖి మీద ఫిర్యాదు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఆ షోలో ఏ వీడియో క్లిప్ మీద వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చిందట. అయినా పాత ప్రోగ్రామ్ కు ఇప్పుడు కేసు ఏమిట‌ని.. ఈ విషయంలో పోలీసులకు అన్ని విధాల సహకరించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పింది ఈమె. ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చిందట శ్రీముఖి.