Begin typing your search above and press return to search.

శ్రీముఖి.. గ్లామర్ డోస్ తగ్గట్లేదుగా!

By:  Tupaki Desk   |   9 Oct 2022 11:30 AM GMT
శ్రీముఖి.. గ్లామర్ డోస్ తగ్గట్లేదుగా!
X
ఇటీవల కాలంలో యాంకర్స్ కేవలం మాటలతోనే కాకుండా వారికి గ్లామర్ తో కూడా ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తెలుగులో మోస్ట్ గ్లామరస్ యాంకర్స్ లలో పోటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక అందులో శ్రీముఖి కూడా ఎప్పటికప్పుడు తన అందాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇటీవల కాలంలో ఆమె గ్యాప్ లేకుండా ఎద అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది.

జులాయి సినిమాలో హీరో చెల్లి పాత్రలో కనిపించిన శ్రీముఖి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది. అయితే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది మాత్రం పటాస్ షో ద్వారానే. టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ బ్యూటీ చాలా బిజీగా మారిపోయింది. మొదట్లో జబర్దస్త్ స్టార్ట్ అవుతున్న సమయంలో కూడా ఆమెకు అవకాశం వచ్చింది.

కానీ ఆమె కాస్త సక్సెస్ అయిన టెలివిజన్ షోల్లో చేయాలని మరో అవకాశం కోసం ఎదురుచూసింది. కానీ వారం తిరిగే లోపు జబర్దస్త్ ఊహించని రేంజ్ కు వెళ్ళిపోయింది. అనంతరం అదే చానల్ నుంచి వచ్చిన మరొక ఆఫర్ మాత్రం ఆమె రిజెక్ట్ చేయలేదు. పటాస్ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ బ్యూటీ ఆ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలలో కూడా నటించింది.

ఇప్పుడు గ్లామర్ షో తో కూడా శ్రీముఖి ఊహించిన విధంగా షాక్ ఇస్తుంది. రీసెంట్ గా అమ్మడు బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. శ్రీముఖి ఫాలోవర్స్ సంఖ్య కూడా ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో చాలా పెరిగిపోయింది. ఇక శ్రీముఖి కెరీర్ విషయానికి వస్తే ఒకవైపు టెలివిజన్ షోలు చేస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా నటించే ప్రయత్నం చేస్తుంది.

ఆ మధ్యలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని అనుకుంది. ఇక అప్పుడప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో కూడా సరికొత్త వీడియోలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అయితే ఎలాంటి రియాలిటీ షో చేసిన కూడా అమ్మడికి మాత్రం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం. శ్రీముఖి త్వరలోనే ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.