Begin typing your search above and press return to search.

పెళ్లిసంద‌డి భామ అందుకున్న బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇదేనా?

By:  Tupaki Desk   |   11 July 2022 7:53 AM GMT
పెళ్లిసంద‌డి భామ అందుకున్న బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇదేనా?
X
ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ న‌టుడు శ్రీకాంత్ కుమారుడు రోష‌న్ హీరోగా, అందాల ముద్దుగుమ్మ శ్రీల‌ల హీరోయిన్ గా పెళ్లి సంద‌డి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ శ్రీల‌ల త‌న క్యూట్ లుక్సుతో యువ‌కుల గుండెల‌ను గుల్ల చేసింది. అంతేకాకుండా శ్రీల‌ల న‌ట‌నను సినీ సెల‌బ్రిటీలు మెచ్చుకున్నారు. స్టార్ హీరోల క‌ళ్ల‌ల్లోనూ ప‌డ‌టంతో ఈ అమ్మ‌డి ద‌శ తిరిగిందని టాలీవుడ్ టాక్.

తంతే బూరెల బుట్ట‌లో ప‌డ్డ‌ట్టు ఈ అందాల ముద్దుగుమ్మ ఏకంగా సూప‌ర్ స్టార్, ప్రిన్స్ మ‌హేశ్ బాబుతో న‌టించే ఆఫ‌ర్ కొట్టేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అల వైకుంఠ‌పురంలో వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో, స‌ర్కారువారిపాట హిట్ త‌ర్వాత మ‌హేష్ బాబు హీరోగా వ‌స్తున్న చిత్రంలో శ్రీలీల న‌టిస్తోంద‌నే టాలీవుడ్ తాజా క‌బురు.

మ‌హేశ్ బాబు 28వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లిగా త‌న అందాల‌తో దుమ్ములేపేస్తుంద‌ని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ప్ర‌ధాన హీరోయిన్ గా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు ముగించుకుని షూటింగుకు సిద్ధ‌మ‌వుతోంది.పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రీలీల‌ మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ తో న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసింది.

ఇందులో మ‌హేష్ బాబుతో క‌లిసి ఒక పాట‌లో కూడా అమ్మ‌డు చిందేస్తుంద‌ని స‌మాచారం. ఓవైపు అందం, మ‌రోవైపు అభినయంతో తెలుగులో వరుస ఆఫర్లతో ఈ భామ దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ప్రస్తుతం మాస్ మాహారాజా ర‌వితేజ‌ సరసన ధమాకా సినిమాలోనూ శ్రీలీల చాన్సు కొట్టేసింది. కాగా ఖ‌లేజా త‌ర్వాత దాదాపు పన్నెండేళ్ల‌కు త్రివిక్రమ్, మహేష్ కలయికలో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.