Begin typing your search above and press return to search.

శ్రీ లీల సుమబాల.. కురాళ్లు గిలగిల..!

By:  Tupaki Desk   |   19 Jun 2023 11:58 AM
శ్రీ లీల సుమబాల.. కురాళ్లు గిలగిల..!
X
కన్నడ భామ శ్రీ లీల ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉంది. ఆమె చేస్తున్న సినిమాల లిస్ట్ చూసి స్టార్ హీరోయిన్స్ సైతం అవాక్కవుతున్నారు. మొదటి సినిమా పెళ్లిసందడి జస్ట్ ఓకే అనిపించినా రవితేజ ధమాకా సినిమాలో అమ్మడి దూకుడు నచ్చి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

ధమాకా హిట్ లో మేజర్ రోల్ పోషించిన శ్రీ లీల ఖాతాలో వరుస స్టార్ ఛాన్స్ లు వచ్చి చేరాయి. రీసెంట్ గా అమ్మడి బర్త్ డే సందర్భంగా శ్రీ లీల నటిస్తున్న ఏడు సినిమాల నుంచి పోస్టర్స్ వదలడం సంచలనంగా మారింది.

తెలుగులో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి ఇలా ఏడు సినిమాలతో సందడి చేయలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం వరకు. బాలయ్య భగవంత్ కేసరి నుంచి వైష్ణవ్ తేజ్ ఆదికేశవ వరకు ఇలా తను నటించే ప్రతై సినిమా పోస్టర్ తో అమ్మడు బర్త్ డే మరింత స్పెషల్ అయ్యింది. టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీ లీల హవా నడుస్తుందని చెప్పొచ్చు. అమ్మడు నటిస్తున్న సినిమాల్లో ఏది సూపర్ హిట్ అయినా కూడా కెరీర్ పరంగా తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదని చెప్పొచ్చు.

ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఫోటో షూట్స్ తో కూడా ఫాలోవర్స్ ని తన మాయలో పడేస్తుంది శ్రీ లీల. లేటెస్ట్ గా అమ్మడు ఫోటోగ్రాఫర్ ఫోజులతో ఫోటో షూట్ చేసింది. కెమెరాతో స్టిల్స్ ఇస్తూ శ్రీ లీల షేర్ చేసిన ఫోటో షూట్ ఆడియన్స్ ని తన మత్తులో పడేస్తున్నాయి. నైట్ సూట్ లో నాటీ అందాలు వావ్ అనిపించేస్తున్నాయి.

వరుస సినిమాలే కాదు ఈ ఫోటో షూట్స్ తో కూడా శ్రీ లీల తన సత్తా చాటుతుంది. ముఖ్యంగా ఈ ఫోటో షూట్ లో తన థై షో చేస్తూ అమ్మడు అదుర్స్ అనిపిస్తుంది. ఈమధ్య హీరోయిన్స్ అంతా కూడా ఫోటో షూట్స్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు.

అమ్మడి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దసరా నుంచి నెక్స్ట్ సమ్మర్ వరకు శ్రీ లీల సినిమాల సందడి ఉండబోతుంది. ఆ సినిమాలతో శ్రీ లీల స్టార్ హీరోయిన్ గా ప్రమోట్ అవడం ఫిక్స్ అని చెప్పొచ్చు. వరుసగా ఏడు సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న శ్రీ లీల దూకుడు ఇలానే ఉంటే మాత్రం అమ్మడు టాప్ ప్లేస్ కి వెళ్లడం పక్కా అని చెప్పొచ్చు.