Begin typing your search above and press return to search.

రాజు గారి దృష్టిలో పడ్డ మోస్ట్‌ క్రేజీ బ్యూటీ

By:  Tupaki Desk   |   2 Nov 2021 3:30 PM GMT
రాజు గారి దృష్టిలో పడ్డ మోస్ట్‌ క్రేజీ బ్యూటీ
X
రాఘవేంద్ర రావు నిర్మాణంలో ఆయన స్వయంగా దర్శకత్వ పర్యవేక్షణ చేసిన పెళ్లిసందD సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా ఆ సినిమా విడుదల అయ్యింది. ఇక హీరోయిన్ గా శ్రీలీలను పరిచయం చేయడం జరిగింది. సినిమా తీవ్ర నిరాశ పర్చింది. దర్శకేంద్రుడు స్థాయి సినిమా కాదంటూ జనాలు పెదవి విరిచారు. ఈ సమయంలో హీరోయిన్ శ్రీలీలకు మాత్రం మంచి ఫాలోయింగ్ దక్కింది. ఇప్పటికే ఆమె రవితేజకు జోడీగా ధమాకా సినిమాలో హీరోయిన్‌ గా నటించే అవకాశంను దక్కించుకుంది. ఆ ఒక్క సినిమా కాకుండా ఒక మెగా హీరో మూవీ లో కూడా ఈమె నటించబోతుందనే వార్తలు వచ్చాయి. మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె ఖాతాలో పడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మరో సినిమాను కూడా ఈమె దక్కించుకుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఆశిష్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. మొదటి సినిమా ఇంకా రాకుండానే రెండవ సినిమాను కూడా పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మరో యూత్‌ ఫుల్‌ సబ్జెక్ట్‌ ను ఆశిష్‌ కోసం రెడీ చేయించారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేయడం జరిగిందట. ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు కాని హీరో.. హీరోయిన్‌ లు ఖరారు అయ్యారు. అలాగే సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ ను దాదాపుగా ఫైనల్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఒక మంచి ట్యాలెంటెడ్ దర్శకుడి చేతిలో ఈ ప్రాజెక్ట్‌ ను పెట్టేందుకు దిల్‌ రాజు ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

శ్రీలీల మొదటి సినిమా తోనే ప్లాప్ ను చవి చూసినా కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకోవడం చాలా గొప్ప విషయం అనడంలో సందేహం లేదు. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ అవ్వడం వల్ల కృతి శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు కృతి శెట్టికి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడికి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. శ్రీలీల నక్క తోకను తొక్కినట్లుగా వరుసగా వస్తున్న ఆఫర్లు చూస్తుంటే రాబోయే అతి తక్కువ రోజుల్లోనే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా ఈ అమ్మడు మంచి పేరును దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల ఇతర భాషలకు సంబంధించిన సినిమాలకు కూడా సంప్రదించబడుతుందట.. కాని ప్రస్తుతానికి తెలుగు లో మాత్రమే నటించాలని ఆమె భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.