Begin typing your search above and press return to search.

ఈ అమ్మడిని ఆపడం ఇక కష్టమే

By:  Tupaki Desk   |   4 Jan 2023 10:30 AM GMT
ఈ అమ్మడిని ఆపడం ఇక కష్టమే
X
పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీలా మొదటి సినిమా తో నిరాశ పర్చినా కూడా అనూహ్యంగా మంచి గుర్తింపు ఈ అమ్మడికి దక్కింది. సినిమా ఫ్లాప్ అయినా హీరోయిన్‌ గా శ్రీలీలా సక్సెస్ అవ్వడంతో వెంటనే ధమాకా సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది. ధమాకా సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్ల ను నమోదు చేయడంతో శ్రీలీలా క్రేజ్ అమాంతం పెరిగింది.

శ్రీలీలా ప్రస్తుతం నితిన్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా రామ్‌ పోతినేని కి జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా శ్రీలీలా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి యొక్క తెరంగేట్రం సినిమాలో కూడా శ్రీలీలా హీరోయిన్‌ గా నటిస్తుంది.

ఈ మూడు సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ధమాకా సినిమా హిట్ తో ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల యొక్క క్రేజ్ పెరగబోతుంది.

ముఖ్యంగా త్వరలో రాబోతున్న మూడు సినిమాలకు కూడా ధమాకా విజయం కలిసి వస్తుంది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్‌ గా శ్రీలీలా ధమాకా తో సూపర్‌ హిట్‌ దక్కించుకున్న నేపథ్యంలో ముందు ముందు సినిమాలకు ఆమె ఇమేజ్ కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ధమాకా సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పటికే శ్రీలీలా తన పారితోషికంను భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాల్లో ఒకటి రెండు అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో శ్రీలీలా పారితోషికం మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ధమాకా తో దూసుకు పోతున్న శ్రీలీలాను ఇక ఆపడం కష్టమే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.