Begin typing your search above and press return to search.

రవితేజతో రొమాన్స్.. శ్రీలీల వర్షన్ ఇది..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 11:30 PM GMT
రవితేజతో రొమాన్స్.. శ్రీలీల వర్షన్ ఇది..!
X
కన్నడ భామ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఛాన్స్ లను అందుకుంటుంది. అమ్మడు చేసిన పెళ్లిసందడి పెద్దగా ఆడకపోయినా శ్రీలీల టాలెంట్ గుర్తించిన మన మేకర్స్ ఆమెని వరుస సినిమాలకు బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ధమాకా సినిమాలో నటిస్తున్న శ్రీలీల ఆ సినిమా లో నటించడంపై కొన్ని విమర్శలు ఎదుర్కొంది. యువ హీరో అయ్యుండి సీనియర్ హీరో రవితేజతో నటించడం ఏంటని ఆమెని ట్రోల్ చేశారు.

వాటిపై హుందాగా స్పందించింది శ్రీలీల పెళ్లి సందడి ముందే ధమాకా ఆఫర్ వచ్చిందని. రవితేజ సర్ తో నటించడం తన లక్కీ అని అన్నది. అంతేకాదు సినిమాలో తన పాత్ర నచ్చింది అందుకే ధమాకా ఓకే చేశానని చెప్పుకొచ్చింది. సో పెళ్లిసందడికి ముందే రవితేజ సినిమాలో శ్రీ లీలని అనుకున్నారన్నమాట. అలా తన మీద వచ్చిన రూమర్స్ పై స్పందించింది అమ్మడు.

ఇక ధమాకా సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది శ్రీ లీల. అసలే హీరోయిన్స్ కరువు ఉన్న టాలీవుడ్ లో ఏ ఒక్క హీరోయిన్ కొద్దిపాటి ఎనర్జీ దానికి తగినట్టు టాలెంట్ చూపిస్తే చాలు ఆమెకు ఆఫర్లు క్యూ కడతాయి.

ధమాకా హిట్ పడితే శ్రీలీలకు మరిన్ని క్రేజీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే శ్రీలీల కి మెగా హీరో మూవీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. దీనితో పాటుగా బాలయ్య బాబు సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట.

ఈ సినిమాలన్ని శ్రీలీలకు తెలుగులో మంచి బూస్టింగ్ ఇస్తాయని చెప్పొచ్చు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లిసందడి సినిమాతో పరిచయమైన శ్రీలీల టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసేలా ఉంది. ధమాకా అనుకున్న టార్గెట్ రీచ్ అయి ఆ వెంట స్టార్ ఛాన్స్ వస్తే అమ్మడికి స్టార్ స్టేటస్ దక్కినట్టే లెక్క.

టాలీవుడ్ లో శ్రీలీల దూకుడు అమ్మడి ఫ్యాన్స్ కి హుశారు తెప్పిస్తుంది. తెలుగులో శ్రీలీల మీద వచ్చిన అటెన్షన్ ని క్యాష్ చేసుకునేందుకు ఆమె నటించిన కన్నడ తొలి సినిమా కిస్ ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.