Begin typing your search above and press return to search.
'హే అబ్బాయి' సాంగ్ లో ఆడిపాడుతున్న శర్వా - ప్రియాంక మోహన్..!
By: Tupaki Desk | 18 Feb 2021 6:40 PM ISTయువ హీరో శర్వానంద్ - ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తోన్న సినిమా ''శ్రీకారం''. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మిస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు - వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ మరియు 'భలేగుంది బాలా' 'సందళ్లే సందళ్లే' పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 'హే అబ్బాయి' అనే మరో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'హే అబ్బాయి.. హే హే అబ్బాయి.. ఇంక ఫోజులు చాలోయి.. కాస్త ఇటేపు చూడోయి' అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది హీరోని లవ్ చేస్తున్న హీరోయిన్.. అతని వెంట పడుతూ పాడుకునే సాంగ్ అని అర్థం అవుతోంది. దీనికి మిక్కీ జె మేయర్ ట్యూన్ అందించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. సింగర్స్ నూతన మోహన్ - హైమత్ ఆలపించారు. ఫుల్ సాంగ్ రేపు శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. 'శ్రీకారం' చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.