Begin typing your search above and press return to search.

'శ్రీకారం' సాంగ్: 'హే అబ్బాయి' అంటూ శర్వా ని టీజ్ చేస్తున్న ప్రియాంక..!

By:  Tupaki Desk   |   19 Feb 2021 7:10 PM IST
శ్రీకారం సాంగ్: హే అబ్బాయి అంటూ శర్వా ని టీజ్ చేస్తున్న ప్రియాంక..!
X
యంగ్ హీరో శ‌ర్వానంద్ - ప్రియాంక అరుళ్ మోహన్‌ జంటగా న‌టిస్తోన్న సినిమా ''శ్రీకారం'' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ అందించిన 'భలేగుంది బాలా' 'సందళ్లే సందళ్లే' పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'హే అబ్బాయి' అనే మూడో పాట లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.

'హే అబ్బాయి.. హే హే అబ్బాయి.. ఇంక ఫోజులు చాలోయి.. కాస్త ఇటేపు చూడోయి' అంటూ సాగిన ఈ పాటలో శర్వా వెంటపడుతూ ప్రియాంక మోహన్ అతన్ని టీజ్ చేస్తోంది. ఇన్నాళ్లు లంగావోణి - చుడీదార్స్ లో కనిపించిన ప్రియాంక ఇందులో ట్రెడీ కాస్ట్యూమ్స్ తో అలరించింది. ఈ టీజింగ్ సాంగ్ కి కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. సింగర్స్ నూతన మోహన్ - హైమత్ ఆలపించారు. ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు చూస్తుంటే మిక్కీ ఈ సినిమాకి డిఫరెంట్ ట్యూన్స్ అందించినట్లు అర్థం అవుతోంది.

కాగా, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిశోర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌ పై రామ్ ఆచంట‌ - గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు - వ్యవసాయం నేపథ్యంలో 'శ్రీకారం' సినిమా ఉంటుందని తెలుస్తోంది.