Begin typing your search above and press return to search.

శ్రీ‌విష్ణు `రాజ రాజ చోర` క‌ళ‌

By:  Tupaki Desk   |   29 Feb 2020 10:57 AM IST
శ్రీ‌విష్ణు `రాజ రాజ చోర` క‌ళ‌
X
పోస్ట‌ర్ తోనే ప‌డేయ‌డం ఓ క‌ళ‌. ఈ క‌ళ‌లో శ్రీ‌విష్ణు చాలానే ఆరి తేరాడు. అత‌డు ఎంచుకుంటున్న క‌థ‌ల్లోనే వైవిధ్యం ఆక‌ట్టుకుంటోంది. అందుకు త‌గ్గ‌ట్టే పోస్ట‌ర్ లోనూ క్రియేటివిటీ సెట్ట‌వుతోంది. ఇంత‌కుముందు బ్రోచేవారెవ‌రురా? త‌ర‌హాలో తాజా పోస్ట‌ర్ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. `రాజ రాజ చోర` అనే టైటిల్.. ఆ గెట‌ప్పు తోనే శ్రీ‌విష్ణు ఆక‌ట్టుకున్నాడు. అత‌డి నుంచి మ‌రో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ వ‌స్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హసిత్ గోలి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇందులో సునయన నాయిక గా న‌టిస్తోంది. హీరో శ్రీ విష్ణు పుట్టినరోజు సంద‌ర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్ట‌ర్ చూస్తుంటే చోర విద్య‌లో ఆరితేరిపోయిన రాజ రాజ చోరుడే క‌నిపిస్తున్నాడు. రాజాధిరాజ రాజ మార్తాండ‌.. చోర క‌ళ‌తో రక్తి క‌ట్టిస్తాడ‌నే అర్థ‌మ‌వుతోంది.

మా హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జ‌రుగుతోంద‌ని నిర్మాత‌లు టి.జి.విశ్వప్రసాద్‌- అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ నాటికి షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని వెల్ల‌డించారు. పోస్ట‌ర్ తో ఆక‌ట్టుకున్నా.. కంటెంట్ ఆద్యంతం మెప్పించాల్సి ఉంటుంది. టీజ‌ర్.. ట్రైల‌ర్ తో అస‌లు విష‌యం రివీల‌వుతుంది కాబ‌ట్టి కాస్త వేచి చూడాలి.