Begin typing your search above and press return to search.

నేనా.. మాస్ హీరోనా?

By:  Tupaki Desk   |   20 March 2018 11:30 PM GMT
నేనా.. మాస్ హీరోనా?
X
పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకపోయినా.. తన ప్రతిభతోనే అవకాశాలు సంపాదించి.. హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు యువ నటుడు శ్రీ విష్ణు. ముందు చిన్న చిన్న పాత్రలు చేస్తూ సాగిన విష్ణు.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత ‘మెంటల్ మదిలో’ సినిమాతోనూ మెప్పించాడు. ఇప్పుడు అతడి నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘నీది నాది ఒకే కథ’. ఈ శుక్రవారమే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అడపాదడపా కొన్ని మాస్ క్యారెక్టర్లు చేసినా.. తనకు మాస్ హీరో కావాలన్న ఆశ ఎంత మాత్రమూ లేదని చెప్పాడు విష్ణు.

మాస్ హీరో కావడమంటే మాటలు కాదని.. దానికి చాలా అంశాలు కలిసి రావాలని.. తనకు అలాంటి ఆశలేమీ లేవని.. తనకు నప్పే పాత్రలు ఎంచుకుంటూ నటుడిగా పేరు తెచ్చుకోవడం మీదే తన దృష్టంతా అని విష్ణు చెప్పాడు. చదువు సరిగా అబ్బక.. జీవితంలో స్థిరపడలేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ ‘నీది నాది ఒకే కథ’ సినిమాలో తన పాత్ర చూసి ఐడెంటిఫై అవుతారని.. ఈ సినిమా ద్వారా మంచి విషయం చెబుతున్నామని విష్ణు తెలిపాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి విష్ణు చెబుతూ.. ‘వీరభోగ వసంతరాయలు అనే విభిన్నమైన సినిమాలో నటిస్తున్నా. అందులోనూ నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. దీని తర్వాత ‘అసుర’ దర్శకుడు కృష్ణవిజయ్ దర్శకత్వంలో ‘తిప్పరా మీసం’ చేస్తాను’’ అని తెలిపాడు.