Begin typing your search above and press return to search.

చిత్తూరు యాస లక్ తెచ్చేనా!!

By:  Tupaki Desk   |   13 March 2018 4:54 AM GMT
చిత్తూరు యాస లక్ తెచ్చేనా!!
X
ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అటు హీరోగానూ మెప్పించిన నటుడు శ్రీ విష్ణు. తన ఫ్రెండ్ నారా రోహిత్ తో కలిసి అప్పట్లో ఒకడుండేవాడు సినిమా అతడికి యాక్టర్ గా మొదట గుర్తింపు తెచ్చింది. తరవాత రామ్ సినిమా ఉన్నది ఒకటే జిందగీలో రామ్ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. తరవాత సోలో హీరోగా మెంటల్ మదిలో సినిమా చేశాడు. ఈ మూవీ బాగుందని రివ్యూలు వచ్చినా డబ్బులు మాత్రం రాలేదు. మొత్తంమీద శ్రీవిష్ణు ఎన్ని ప్రయత్నాలు చేసినా కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు.

తనకు బ్రేక్ నిచ్చే హిట్ కోసం శ్రీవిష్ణు రూటు మార్చాడు. తన రాబోయే సినిమా నీది నాది ఒకే కథ సినిమాలో చిత్తూరు యాస వినిపించబోతున్నాడు. ఈ మూవీలో తన రోల్ గుర్తుండిపోయే ఉంటుందని.. చిత్తూరు యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు ఇంకా గుర్తుండిపోతాయని శ్రీవిష్ణు నమ్మకంతో ఉన్నాడు. ఈ స్లాంగ్ పర్ ఫెక్ట్ గా రావడం కోసం శ్రీవిష్ణు ఎంతో కష్టపడి ప్రయత్నం చేశాడట. వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తున్న నీదినాది ఒకే కథ మూవీ మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంచి నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చినా ఛాన్సులు పెద్దగా రావడం లేదంటే కాలం కలిసిరావడం లేదనే అనుకోవాలి. నీదినాది ఒకే కథ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఫిలిం మేకర్లు అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కు చేయడానికి ఇంత టైం పట్టింది. బిచ్చగాడు ఫేం హీరోయిన్ సాట్నా టైటస్ ఇందులో హీరోయిన్ గా నటించింది. చిత్తూరు యాస శ్రీవిష్ణుకు ఎంత మేరకు సాయం చేస్తుందో చూడాలి.