Begin typing your search above and press return to search.

గజినీ వేషంలో శ్రీవిష్ణు

By:  Tupaki Desk   |   6 April 2018 10:32 PM IST
గజినీ వేషంలో శ్రీవిష్ణు
X
సాధారణంగా సినిమాలకు సీక్వెల్ చూస్తుంటాం కాని ఇది మాత్రం కేవలం గెటప్ కు సీక్వెల్. విభిన్నమైన కాన్సెప్ట్ ఉన్న మూవీస్ తో కొత్త తరహా ఇమేజ్ ఏర్పరుచుకున్న హీరో శ్రీవిష్ణు రాబోయే కొత్త సినిమా వీరభోగవసంతరాయలులో కాస్త గజినీని పోలిన వెరైటీ అవతారంలో కనిపించబోతున్నాడు అని ఇన్ సైడ్ టాక్. ఇది యూనిట్ నుంచి అఫీషియల్ గా అందిన వార్త కాదు కాని నిజమే అని టాక్. జుట్టు మొత్తం బాగా కురచగా కత్తిరించి దూరం నుంచి గుండునే అనిపించేలా ఒళ్లంతా టాటూలు పొడిపించుకుని ప్రేక్షకులను థ్రిల్ చేసే పాత్రలో శ్రీవిష్ణు పాత్ర ఉండబోతోందని తెలిసింది. అప్పట్లో ఒకడుండేవాడు-మెంటల్ మదిలో-నీది నాది ఒకే కథ వరస విజయాలతో ఒప్పుమీదున్న శ్రీవిష్ణుకి ఈ పాత్ర ఖచ్చితంగా ఛాలెంజింగ్ రోలే.

ఇది ఒక రకంగా మల్టీ స్టారర్ అని చెప్పొచ్చు. శ్రీవిష్ణుతో పాటు నారా రోహిత్-సుధీర్ బాబు కూడా ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. శ్రేయ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా బాబ్డ్ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపించనుంది. పెళ్లి కాకముందే శ్రేయ వీరభోగవసంతరాయలు షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు ప్లాన్ చేసిన ఈ మూవీకి ఇంద్రసేనా దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తయినప్పటికీ సరైన విడుదల సమయం కోసం ఎదురు చూస్తోంది యూనిట్. మే చివరి వారం లేదా జూన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రేయ కనక తేజ సినిమా చేయకపోతే ఇదే తన చివరి సినిమా అవుతుంది. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన వీరభోగవసంతరాయలు టైటిల్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.