Begin typing your search above and press return to search.

పవన్ అభిమానిగా మరో హీరో

By:  Tupaki Desk   |   19 March 2018 11:14 AM GMT
పవన్ అభిమానిగా మరో హీరో
X
ప్రస్తుతం ఇండస్ట్రీలోకి వస్తోన్న హీరోలకు సీనియర్ హీరోల్లో ఎవరో ఒకరు చాలా ఇష్టం ఉండే ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుతం హీరోలకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంచెం హై స్టేజ్ లో ఉన్న నితిన్ కూడా తాను ఒక హీరో అని మర్చిపోయి మరి పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. అంతే కాకుండా ఆయన పేరును సినిమాలో వాడుకోవడం కూడా చూస్తుంటాం.

పవర్ స్టార్ నేమ్ కొంచెం టచ్ చేసినా హైప్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఇకపోతే రీసెంట్ గా శ్రీ విష్ణు సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పేరు గట్టిగా వినిపిస్తుందట. ఎందుకంటే ఆ సినిమాలో విష్ణు పవన్ కళ్యాణ్ అభిమానిలా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో నీది నాది ఒకే కథ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన కొన్ని విషయాలను శ్రీ విష్ణు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఈ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ అభిమానిలా కనిపిస్తాను. నేను ఓ విధంగా వెంకటేష్ గారిని ఎక్కువగా ఇష్టపడతాను. పవన్ గారంటే కూడా చాలా ఇష్టం అంటూ కాంట్రవర్షియల్ కాకుండా ఒక విషయాన్ని చెప్పాడు. సినిమాలో ఆయన ఫ్యాన్ గా కనిపించడం నిజంగా కథలో చాలా కీలకం. దాదాపు 80% యూత్ లో ఆయనకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. నేను కూడా ఒక విలక్షణమైన పవన్ అభిమానిగా సినిమాలో కనిపించాను. ఆ పాత్ర అందరికి నచ్చుతుందని అనుకుంటున్నట్లు శ్రీ విష్ణు తెలిపాడు. మార్చ్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది.