Begin typing your search above and press return to search.

శ్రీముఖి అరబిక్ టాటూ చూశారా!!

By:  Tupaki Desk   |   15 Feb 2018 4:42 AM GMT
శ్రీముఖి అరబిక్ టాటూ చూశారా!!
X
శరీరంపై రకరకాల టాటూలు వేయించుకుని అభిమానులను.. ఫాలోయర్లను ఆకట్టుకున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఎవరి ఇష్టం వారికి ఆనందం అన్నట్టుగా టాటూలు వేయించుకోవద్దని అనలేకపోయినా.. సెలబ్రిటీలు టాటూలుగా ఏం వేయించుకున్నారన్నది ఆసక్తి క్రియేట్ చేస్తుంది.

కొందరి టాటూలు ఆకట్టుకుంటే ఇంకొందరివి ఆశ్చర్య పరుస్తాయి. ఈ కేటగిరీలోకే వస్తుంది యాంకర్ టర్న్ డ్ యాక్టర్ శ్రీముఖి. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాటూ వేయించుకున్నానంటూ.. దానిని చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ అరబిక్ కొటేషన్ ను అదే భాషలో టాటూ గా వేయించుకుంది. చాలామందికి అరబిక్ రాదు కాబట్టి ఆ కొటేషన్.. దాని అర్ధం కూడా ఆమే చెప్పేసింది. ‘‘ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హుబా నఫ్సక్ ఆలా అనే టాటూ వేయించుకున్నా. అరబిక్ లో దీని అర్ధం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నేను పుట్టినప్పటి నుంచి నా ఫేవరెట్ నేనే’’అంటూ తన టాటూ గురించి షేర్ చేసింది.

హీరోయిన్లుగా ఫాంలో ఉన్నప్పుడే టాటూ ముద్ర వేయించుకోవడానికి నేటి తరం అమ్మాయిలు ఏమీ జంకడం లేదు. త్రిష.. నయనతార.. సమంత.. తాప్సీ.. అనసూయ... ఇలా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. వీళ్ల క్లబ్ లోకి లేటెస్ట్ గా శ్రీముఖి ఎంటరైంది. కాకుండా మిగతా వాళ్లంతా ఇంకేవో ఇష్టాల గురించి టాటూ వేయించుకుంటే తనను తానే ప్రేమించుకుంటానంటూ కాస్తంత ప్రత్యేకత చాటుకుంది.