Begin typing your search above and press return to search.

ఈ యాంకర్ కు ఛాన్సివ్వండయ్యా!!

By:  Tupaki Desk   |   10 April 2017 1:03 PM GMT
ఈ యాంకర్ కు ఛాన్సివ్వండయ్యా!!
X
మామూలుగా యాంకర్లందరూ ఒక్కొక్కరు ఏదో విధంగా టాలెంట్ చూపిస్తూ సినిమాల్లో బిజీగ అయిపోతున్నారు. తన గ్లామర్ తో పడేసింది రష్మి. అదే రూటులో ఐటెం సాంగ్స్ చేసుకుంటోంది అనసూయ. ఆ తరువాత యంగ్ యాంకర్ శ్రీముఖి కూడా ఇదే రూటులో ఇరగదీస్తుంది అనుకుంటే.. వెండితెరపై ఎందుకో ఈ అమ్మడు అంతగా క్లిక్కవలేకపోయింది. ప్రయత్నాలు మాత్రం గాట్టిగానే చేస్తూ ఉంది.

ఈ మధ్యన ఎక్కువగా డబ్ స్మాష్ లు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న శ్రీముఖి.. కొత్త సినిమాల్లోని పాటలను వేటినీ వదలట్లేదు. అదిగో చూడండి.. అమ్మడు గురు సినిమాలో హీరోయిన్ రితిక చేసిన లవ్ సాంగుకు ఇప్పుడు డబ్ స్మాష్‌ చేసింది. ఈ పాటలో ఆ హీరోయిన్ తరహాలోనే చిలిపి హావభావాలు పలికిస్తూ.. అబ్బో బాగానే ఇంప్రెస్ చేసింది. కాని ఇంతటి యాక్టింగ్ టాలెంట్ ఉన్నా కూడా.. అలాగే గ్లామరసం ఉట్టిపడే ఫోటోషూట్లు చేస్తూనే ఉన్నా కూడా.. ఎందుకో హీరోయిన్ అవకాశాలు మాత్రం పలకరించట్లేదు.

ఇకపోతే శ్రీముఖి ''బాబు బాగా బిజీ'' సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా రిలీజ్ తరువాత అమ్మడి ఫేట్ ఏమన్నా మారుతుందేమో చూడాలి మరి. వెయిట్ అండ్ వాచ్.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/