Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టివి బేబి టూ హాట్

By:  Tupaki Desk   |   25 Dec 2017 12:13 PM GMT
ఫోటో స్టోరి: టివి బేబి టూ హాట్
X

చూస్తుంటే రోజు రోజుకి యాంకర్స్ వారి అందాలతో చాలా పిచ్చెక్కిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరు మాటలతో ఆకట్టుకుంటుంటే మరొకరు మాటలతో పాటు అందాలతో కూడా స్పెషల్ గా ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం హాట్ యాంకర్స్ టాలీవుడ్ లో చాలా మందే పుట్టుకొస్తున్నారు. వారి అందాలతో ఇతర స్టార్ యాంకర్స్ కి చాలా పోటీని ఇస్తున్నారు. ఆ లిస్ట్ లో శ్రీముఖి కూడా ఉంది.

కాస్త బొద్దుగా కనిపించే శ్రీ ముఖి ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది. రియాలిటీ షోల్లోనే కాకుండా ఆడియో వేడుకల్లో కూడా హోస్ట్ గా కనిపిస్తూ మంచి అవకాశాలను అందుకుంటోంది. తన ఇమేజ్ ను కూడా చాలా పెంచేసుకుంటుందని చెప్పాలి. మొన్నటి వరకు గ్లామర్ లుక్ లో కొంచెం లిమిట్ గా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు డోస్ కొంచెం పెంచేసింది. షార్ట్ డ్రెస్సుల్లో కుర్రకారు మతి పోగొడుతోంది. ఇటీవల ఓ షోలో దిగిన ఫొటోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

అంతే కాకుండా కేవలం శ్రీముఖి కోసమే షోను మళ్లీ మళ్లి చూడాలని అనిపిస్తుంది. అమ్మడు ఒక స్టైలిష్ హాట్ డ్రెస్ లో కనిపించింది. బ్లాక్ కలర్ లో మెరుస్తోన్న ఆ డ్రెస్ అందరిని చాలా ఆకర్షిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా శ్రీ ముఖి ఇంత హాట్ గా ఉన్నావేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమ్మడు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అందులోను కొంచెం హాట్ లుక్స్ లొనే కనిపించబోతోందట. చూడాలి మరి శ్రీ ముఖి అందాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో..