Begin typing your search above and press return to search.

మూడు ఛానెళ్లు ఆయన్ని వెంటాడుతున్నాయట

By:  Tupaki Desk   |   12 Jan 2016 10:30 PM GMT
మూడు ఛానెళ్లు ఆయన్ని వెంటాడుతున్నాయట
X
తన బేనర్లో ఒక ఫ్లాప్ సినిమా తీస్తే.. దాని వల్ల తాను ఎంత నష్టపోబోతున్నాననే విషయం రెండో రోజుకే చెప్పేయగలనని.. కానీ సినిమా సక్సెస్ అయితే మాత్రం అది ఏ రేంజికి వెళ్తుందనేది చెప్పలేనని.. ‘నేను శైలజ’ సినిమా సక్సెస్ కూడా తనకు అలాంటి ఆశ్చర్యాన్నే కలిగిస్తోందని అంటున్నాడు నిర్మాత స్రవంతి రవికిషోర్. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని.. ‘నువ్వే కావాలి’ తర్వాత తన కెరీర్లో ఇదో పెద్ద మలుపుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.

‘‘నువ్వే కావాలి సినిమాకు ముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ సినిమా సాధించిన విజయం కారణంగా నా పిల్లల్ని అమెరికాకు పంపించి చదివించుకోగలిగాను. ‘నేను శైలజ’ మళ్లీ నా కెరీర్లో ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఇంత విజయం సాధిస్తుందని అంచనా వేయలేదు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అర్జున్ థియేటర్ వారం రోజులు మొత్తం ఫుల్ అయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర్లోని శాంతి థియేటర్లో వారం రోజుల్లో 28 షోలకు 26 షోలు ఫుల్స్ పడ్డాయి. సినిమా విడుదలకు ముందు శాటిలైట్ రైట్స్ అమ్మబోతే.. నేను అనుకున్న దానికంటే చాలా తక్కువ ప్రైస్ కు అడిగారు. నేను ఊరుకున్నాను. ఇప్పుడు తెలుగులో ఉన్న మూడు మేజర్ ఛానెల్స్ శాటిలైట్ రైట్స్ కోసం నన్ను వెంటాడుతున్నాయి. రీమేక్ రైట్స్ కోసం కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఐతే ఎవరు ఎక్కువ డబ్బిస్తే వాళ్లకు హక్కులివ్వను. ఎవరు నా సినిమాకు ఆ భాషల్లో న్యాయం చేయలగరనిపిస్తే వాళ్లకే రైట్స్ ఇస్తా’’ అని చెప్పారు రవికిషోర్.