Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత వచ్చి 30 సంవ‌త్స‌రాలయ్యింది

By:  Tupaki Desk   |   6 Sep 2015 10:39 PM GMT
ఆ నిర్మాత వచ్చి 30 సంవ‌త్స‌రాలయ్యింది
X
లేడీస్ టైల‌ర్‌ - నువ్వే కావాలి - నువ్వు నాకు న‌చ్చావ్‌ - నువ్వే నువ్వే - రెడీ .. లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్స్‌ ని తెర‌కెక్కించిన సంస్థ స్ర‌వంతి మూవీస్‌. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మాత‌గా ఈ సినిమాలు తెర‌కెక్కాయి. స్ర‌వంతి మూవీస్ ప్రారంభించి ఇప్ప‌టికే 30 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఇన్నేళ్ల‌లో ఎన్నో విజ‌యాలు సంస్థ సొంతం చేసుకుంది.

ప్ర‌స్తుతం ఉన్నఅర‌డ‌జ‌ను అభిరుచి గ‌ల నిర్మాత‌ల్లో స్ర‌వంతి ర‌వికిషోర్ ఒక‌రు. సెల‌క్టివ్‌ గా క‌థ‌ల్ని ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తుంటారాయ‌న‌. హాస్యం, కుటుంబ విలువ‌ల‌కు పెద్ద పీట వేసి సినిమాలు తెర‌కెక్కిస్తుంటారు. త‌రుణ్ హీరో గా ఆయ‌న నిర్మించిన నువ్వే కావాలి ఓడియ‌న్ థియేట‌ర్‌ లో ఏకంగా ఓ ఏడాది పాటు ఆడిందంటే .. అర్థం చేసుకోవ‌చ్చు. అపార అనుభ‌వం ఉన్న ఆయ‌న‌ ప్ర‌స్తుతం కాస్ట్ ఫెయిల్యూర్ నేప‌థ్యంలో బ‌డ్జెట్ కంట్రోల్ ఎలా చేయాల‌న్న‌దానిపైనా పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు చేసి రామ్‌ తో సినిమాలు నిర్మిస్తున్నారు. రామ్‌ ఓ వైపు శివం ఆన్‌ సెట్స్ ఉండ‌గానే హ‌రిక‌థ చిత్రం షూటింగ్ కోసం ప‌రుగులు పెడుతున్నాడు.

సో, రామ్ హీరోగా తెర‌కెక్కుతున్న శివం ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హిట్‌ అవ్వాల్సిందే. శ్రీ‌నివాస‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ మెజారిటీ భాగం పూర్త‌యింది. అక్టోబ‌ర్ 2న సినిమా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విజ‌యంపై స్ర‌వంతి ర‌వికిషోర్ ఎంతో ధీమాని వ్య‌క్తం చేస్తున్నారు. ఔట్‌ పుట్ అద్భుతంగా వ‌చ్చింది. క‌చ్ఛితంగా హిట్ కొట్టి తీర‌తాం అని చెబుతున్నారు.