Begin typing your search above and press return to search.

థియేటర్లలోనే 'SR క‌ళ్యాణమండ‌పం'

By:  Tupaki Desk   |   28 May 2021 6:40 AM GMT
థియేటర్లలోనే SR క‌ళ్యాణమండ‌పం
X
'రాజావారు రాణిగారు' ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం - 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''SR క‌ళ్యాణమండ‌పం EST.1975''. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్ర‌మోద్ - రాజులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'చూసాలే క‌ళ్లారా' 'చుక్కల చున్నీనే' సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని మిలియన్ల వ్యూస్ రాబడుతున్నాయి.

ఇదిలావుంటే ప్రస్తుతం థియేటర్స్ మూతబడి ఉండటంతో కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ కు వెళ్తున్నాడు. దీంతో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించిన 'SR క‌ళ్యాణమండ‌పం' చిత్రాన్ని కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నారని, గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ''SR క‌ళ్యాణమండ‌పం'' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన కొత్త పోస్టర్ లో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.

కాగా, ''SR క‌ళ్యాణమండ‌పం'' చిత్రానికి హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. ఇందులో విలక్షణ నటుడు సాయి కుమార్ - తనికెళ్ల భరణి - తులసి - శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.